అంగన్‌వాడీలకు భవనాలు నిర్మించాలి

0
1


అంగన్‌వాడీలకు భవనాలు నిర్మించాలి

కంజర్‌(మోపాల్‌), న్యూస్‌టుడే: మోపాల్‌ మండలం కంజర్‌ గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రాల పరిస్థితి అధ్వాన్నంగా మారుతుంది. ఇక్కడ మూడు అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నప్పటికి సొంత భవనాలు నిర్మించలేదు. దీంతో అద్దె గదులు, శిథిల భవనాల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండో అంగన్‌వాడీ కేంద్రానికి సొంత భవనం లేకపోవడం, అనువైన గదులు అద్దెకు దొరకకపోవడంతో ప్రాథమిక పాఠశాలలో వృథాగా ఉన్న ఒక రేకుల షెడ్డులో ఏర్పాటు చేశారు. ఈ షెడ్డు సైతం శిథిలావస్థకు చేరుకోవడంతో పాటు తాగునీరు, మరుగుదొడ్ల వంటి కనీస వసతులు కూడా లేవు. ఫలితంగా కేంద్రాలకు వచ్చే చిన్నారులు, బాలింతలు, గర్భిణీలు ఇబ్బంది పడుతున్నారు.

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here