అంచెలంచెలుగా యూజీడీ పనులు అందుబాటులోకి

0
0నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో కొనసాగుతున్న యూజీడీ పనులు అంచెలంచెలుగా అందుబాటులోకి తీసుకువస్తున్నారని నిజామాబాద్‌ అర్బన్‌ శాసనసభ్యులు బిగాల గణేష్‌ గుప్తా తెలిపారు. సోమవారం ఎల్లమ్మ గుట్ట వద్ద నిర్మాణం పనులు పూర్తిచేసుకున్న రెండవ మురుగునీటి శుద్ధి ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 నెలల క్రితం 31.5 ఎంఎల్‌డి కెపాసిటీ కలిగిన ఎస్‌.టి.పి.ని మంత్రిగారు ప్రారంభించిన సంగతి ప్రజలకు తెలుసన్నారు. అదేవిధంగా ఈరోజు 15 కోట్ల ఖర్చుతో నిర్మాణం పూర్తి చేసుకున్న 15 ఎంఎల్‌డి కెపాసిటీ కలిగిన ఎస్‌.టి.పి.ని ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. భూగర్బ మురికి కాలువల నిర్మాణ పనుల వల్ల పట్టణ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ సహకరించారని, ప్రజలు ఎంతో ఓపికతో ఎదురు చూస్తున్న పనులు పూర్తి చేసుకునే స్థాయికి వచ్చాయన్నారు. ఇప్పటి నుండి గహాల నుండి విడుదల చేసే మురుగునీటిని యూజీడీకి కనెక్ట్‌ చేసే పనులను త్వరలోనే పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని, తద్వారా ఈ పనులు పూర్తయితే నగరంలో కేవలం వర్షపు నీరు తప్ప మోరీలలో మురుగునీరు కనిపించదని తెలిపారు. తెలంగాణలో హైదరాబాద్‌ తర్వాత మన నిజామాబాద్‌ నగరంలోనే యూజీడీ వ్యవస్థ అందుబాటులోకి రానున్నదని తెలిపారు. సహకరించిన ప్రజలందరికీ కతజ్ఞతలు తెలిపారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here