అంతరిక్షం..అద్భుతం

0
1


అంతరిక్షం..అద్భుతం

ఆసక్తిని పెంచిన ఇస్రో ప్రదర్శనలు

విద్యావేత్త చుక్కారామయ్య సందర్శన

తరలివచ్చిన చిన్నారులు..తల్లిదండ్రులు ● నేడు ముగింపు

న్యూస్‌టుడే, సుభాష్‌నగర్‌


అంతరిక్షంలో వృథా వస్తువులపై తీరుపై వివరిస్తున్న గిరిరాజ్‌ కళాశాల విద్యార్థులు

చంద్రయాన్‌..మంగళయాన్‌..అంతరిక్షంలో ఆర్బిటాల్‌..చంద్రునికి మీద దిగిన లాండర్‌..ఇలా ఇస్రో వారి అరుదైన ఆవిష్కరణలు ఆసక్తిని పెంచాయి. ఇందూరు చిన్నారులను అబ్బురపర్చాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శ్రీహరికోట శాస్త్రవేత్తలు నిజామాబాద్‌లోని నిర్మలహృదయలో ఏర్పాటు చేసిన విజ్ఞాన సదస్సు రెండో రోజు శనివారం భారత అంతరిక్షయానం విశేషాలను తెరపై ప్రదర్శించారు. మరో వేదికపై వ్యోమగామిగా నేను కూడా..అంటూ సెల్ఫీలతో సందడి చేశారు. చిత్రలేఖనం పోటీల్లో చిన్నారులు ప్రతిభ చూపించారు. ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరై ప్రదర్శనను తిలకించారు. శాస్త్రవేత్తలు ఆయన్ని సత్కరించారు. వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు, చిన్నారులు, తల్లిదండ్రులు తరలివచ్చారు.

చుక్కా రామయ్యను సత్కరిస్తున్న ఇస్రో శాస్త్రవేత్తలు

విద్యార్థులను అడిగి తెలుసుకుంటున్న డీఈవో దుర్గాప్రసాద్‌

మరిచిపోలేం…

ఇందూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు

మేము ఇలాంటి ప్రదర్శనను తిలకిస్తామని ఎప్పుడూ అనుకోలేదు. చంద్రయాన్‌, మంగళయాన్‌, ఉపగ్రహాలు, రాకెట్లు, అంతరిక్ష కేంద్రం ఉన్నాయి. ఈ ప్రదర్శన మరిచిపోలేని అద్భుతం. చాలా విషయాలను తెలుసుకున్నాం. మా స్నేహితులను కూడా తీసుకొచ్చాం.

వారం రోజులుంటే బాగుండేది

వన్నెల్‌-కే గ్రామ చిన్నారులు

మా ఊర్లోనే దసరా సెలవులను ఎంజాయ్‌ చేద్దామనుకున్నాం. మా బాబాయ్‌ సాగర్‌ ఈ ప్రదర్శన చూడాలని వన్నెల్‌-కే నుంచి తీసుకువచ్చారు. ఇందులోని ప్రదర్శనలను చూసిన తర్వాత చాలా విషయాలను తెలుసుకున్నాం. పుస్తకాల్లో చదివిన వాటికన్న గొప్పగా అవగాహన కలిగింది. దీన్ని కేవలం మూడు రోజుల కాకుండా వారం పాటు కొనసాగిస్తే బాగుండేది.

శాస్త్రవేత్తనవుతా..

రిద్ది, నిజామాబాద్‌

తరగతి గదిలో చదువుతో పాటు అన్ని రంగాలపై అవగాహన పెంచుకోవాలని అమ్మానాన్నలు, గురువులు ఎప్పుడూ చెబుతుంటారు. నాకు అంతరిక్షం విషయాలను తెలుసుకోవడం చాలా ఇష్టం. అందుకే విజ్ఞానమేళాలో పాల్గొనేదాన్ని. ఇక్కడి ప్రదర్శనలు చూసిన తర్వాత తప్పకుండా శాస్త్రవేత్తను కావాలని అనిపిస్తుంది. సరికొత్త విషయాలను పరిశోధించాలని ఉంది.

భావి శాస్త్రవేత్తలకు స్ఫూర్తిదాయకం

విద్యావేత్త చుక్కారామయ్య

ప్రపంచవ్యాప్తంగా భారత దేశానికి గౌరవాన్ని తీసుకువచ్చిన ఇస్రో ఇందూరులో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన ఎందరో భావి శాస్త్రవేత్తలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. అరుదైన ప్రయోగాలకు వేదికగా మారడం అభినందనీయం. రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ప్రాంతాల్లో ఇలాంటి విజ్ఞాన సదస్సులను ఏర్పాటు చేయాలి. చిన్నారుల్లో అంతరిక్షంపై అవగాహన పెంచాల్సిన అవసరముంది. ఆ దిశగా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించాలి.

ఇది నా అదృష్టం

ప్రభాకర్‌, నిర్వాహక సభ్యుడు

ఇస్రో మొదటిసారిగా జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన నిర్వహణలో మమేకం అయ్యే అవకాశం రావడం నా అదృష్టం. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు తీసుకువచ్చేలా యాజమాన్యాలను సంప్రదించాం. శాస్త్రవేత్తలు, ఏర్పాట్లలో బాధ్యత వహించడం సంతోషంగా ఉంది.

విజేతలకు బహుమతి ప్రదానం నేడు

గంగాకిషన్‌, జిల్లా సైన్సు అధికారి

ఇస్రో వారోత్సవాల విజ్ఞాన ప్రదర్శనకు విద్యాసంస్థల విద్యార్థులు, యువకులు, తల్లిదండ్రులు ఆసక్తిగా పాల్గొన్నారు. ఇలాంటి ప్రదర్శనలు మన జిల్లా విద్యార్థులకు గొప్పవరం. సహకరించిన శాస్త్రవేత్తలు, అధికారులు, పాఠశాల యాజమాన్యాలకు కృతజ్ఞతలు. ఆదివారం ఉదయం 10 గంటలకు ముగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. చిత్రలేఖనం, క్విజ్‌ పోటీల విజేతలకు బహుమతి ప్రదానం ఉంటుంది.

విజ్ఞాన విషయాలు తెలిశాయి

కలీముల్లా, ముర్సాలిన్‌, ధర్మారం(బి) మైనారిటీ గురుకుల విద్యాలయం

మా గురుకుల ఉపాధ్యాయులు చెప్పడంతోనే ఇక్కడికి వచ్చాం. మన దేశానికి గర్వకారణంగా నిలుస్తున్న ఇస్రో ప్రదర్శనలు ఎన్నో కొత్త కొత్త విజ్ఞాన విషయాలను నేర్పించాయి. అంతరిక్షంలో వ్యోమగాములు ఎంతలా కష్టపడుతారో తెలుసుకున్నాం. ఇక్కడి విషయాలను అందరికీ చెబుతాం.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here