అంతర్జాతీయ పోటీలకు ఇందూర్‌ క్రీడాకారులు

0
2


అంతర్జాతీయ పోటీలకు ఇందూర్‌ క్రీడాకారులు

నిజామాబాద్‌ క్రీడావిభాగం, న్యూస్‌టుడే: ఇందూర్‌ గడ్డ నుంచి ఇద్దరు క్రీడాకారులు అంతర్జాతీయస్థాయిలో సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. ఈనెల 18 వరకు చైనా దేశంలోని చెంగ్డు పట్టణంలో నిర్వహించే ప్రపంచ పోలీస్‌, ఫైర్‌ -2019 క్రీడా పోటీల్లో పోలీస్‌శాఖలో కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఎండీ అఫ్సర్‌, నవాతే శ్రీనివాస్‌లు పాల్గొనడానికి సీపీ కార్తికేయ అనుమతినిచ్చారు. గతంలో ఎండీ అఫ్సర్‌ దుబాయిలో నిర్వహించిన ప్రపంచ పోలీస్‌ క్రీడలు-2017లో ప్రాతినిధ్యం వహించారు. నవాతే శ్రీనివాస్‌ దుబాయి, రష్యా, యూఎస్‌ఏల్లో నిర్వహించిన ప్రపంచస్థాయి పోటీల్లో ప్రాతినిథ్యం వహించారు.


క్రీడల్లో రాణించడం అభినందనీయం●

ఉషూ అంతర్జాతీయ దినోత్సవాలు

నిజామాబాద్‌ క్రీడావిభాగం, న్యూస్‌టుడే: క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయస్థాయిలో రాణించడం అభినందనీయమని ఒలింపిక్‌ సంఘం మాజీ కార్యదర్శి అంద్యాల లింగయ్య అన్నారు. డీఎస్‌ఏ మైదానంలో శనివారం ఉషూ అంతర్జాతీయ దినోత్సవాన్ని శిక్షకుడు ఉమేర్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఇందులో అంతర్జాతీయ, జాతీయ క్రీడాకారులు ఎండీ ఇబ్రహీం, ఎండీ ఆవేజ్‌, ఎస్‌కే అల్మాస్‌, అనాబియా తహరీన్‌లను సన్మానించారు. విద్యార్థి దశ నుంచే క్రీడల్లో రాణిస్తే ఉత్తమ భవిష్యత్తు ఉంటుందని లింగయ్య పేర్కొన్నారు. తొలుత జిల్లాస్థాయి పోటీల్లో రాణించిన క్రీడాకారులకు పతకాలను బహూకరించారు. కార్యక్రమంలో ఒలింపిక్‌ సంఘం మాజీ కోశాధికారి బొబ్బిలి నర్సయ్య, జిమ్నాస్టిక్‌ అసోసియేషన్‌ కార్యదర్శి సాయాగౌడ్‌, ఉషూ సంఘం ఛీప్‌ ప్యాట్రన్‌ ఎండీ సర్ఫరాజ్‌హైమద్‌, ఎస్‌కే అన్వర్‌పాషా తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here