అంతర్జాలంలో నమోదు చేయాలి

0
0


అంతర్జాలంలో నమోదు చేయాలి

డిచ్‌పల్లి ఠాణాలో ఎస్సైతో మాట్లాడుతున్న సీపీ కార్తికేయ

డిచ్‌పల్లి, న్యూస్‌టుడే: ఠాణాకు వచ్చే ఫిర్యాదులన్నింటిని ఎప్పటికప్పుడు అంతర్జాలంలో నమోదు చేయాలని సీపీ కార్తికేయ సిబ్బందిని ఆదేశించారు. డిచ్‌పల్లి ఠాణాను గురువారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. పరిసరాలతో పాటు దస్త్రాలను పరిశీలించారు. ఫిర్యాదుదారునితో మర్యాదపూర్వకంగా వ్యవహరించి సమస్యను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఠాణాకు అవసరమైన సదుపాయాలను ఎస్సైని అడిగి తెలుసుకొన్నారు. వెంట ఏసీపీ శ్రీనివాస్‌, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై నవీన్‌కుమార్‌ ఉన్నారు.

ఇందల్‌వాయి: మండల కేంద్రంలోని ఠాణాను గురువారం కమిషనర్‌ కార్తికేయ ఆకస్మిక తనిఖీ చేశారు. ఫిర్యాదుల విభాగంలో వివరాలను పరిశీలించారు. కొత్తగా ఏర్పడిన ఠాణాకు కావాల్సిన అవసరాలను సిబ్బంది ద్వారా తెలుసుకొన్నారు. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని చెప్పారు. పెట్రోలింగ్‌ వాహన సిబ్బంది గ్రామానికి వెళ్లినప్పుడు గతంలో జరిగిన సంఘటనలపై ఆరా తీయాలని సూచించారు. వెంట ఏసీపీ శ్రీనివాస్‌ కుమార్‌, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ మల్లికార్డున్‌రెడ్డి, డిచ్‌పల్లి సీఐ వెంకటేశ్వర్లు ఉన్నారు.

https://betagallery.eenadu.net/htmlfiles/132082.html

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here