అంతర్‌ జిల్లా దొంగ అరెస్టు

0
6


అంతర్‌ జిల్లా దొంగ అరెస్టు

● ద్విచక్ర వాహనం సహా రూ 1.5ం లక్షల సొత్తు స్వాధీనం


వివరాలు వెల్లడిస్తున్న కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ, చిత్రంలో పట్టణ సీఐ రామకృష్ణ, ఎస్సైలు

కామారెడ్డి నేరవిభాగం, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలో దొంగతనానికి పాల్పడిన ఓ అంతర్‌ జిల్లా దొంగను కామారెడ్డి పోలీసులు బుధవారం అరెస్టు చేశారని డీఎస్పీ లక్ష్మీనారాయణ చెప్పారు. జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. స్థానిక శివాజీరోడ్‌లోని పిట్ల గల్లీలో జులై 22న తెల్లవారు జాము ప్రాంతంలో తోకల నర్సింలు ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ ఘటనలో నర్సింలు ఇంట్లోని రూ.2.09లక్షల నగదుతో పాటు రెండు తులాల బంగారం, 10 తులాల వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. బాధితుని ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు సమీపంలోని సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించగా.. జిల్లా కేంద్రం పరిధిలోని ఇంద్రానగర్‌ కాలనీ వాసి మహ్మద్‌ షాహద్‌ ఈ దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. డ్రైవర్‌గా పనిచేసే షాహిద్‌ పాత నేరస్తుడే కావడంతోనే పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. పట్టణ సీఐ రామకృష్ణ, ఎస్సైలు గోవింద్‌, రవికుమార్‌ల ఆధ్వర్యంలో బుధవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా అతను పట్టుబడ్డాడు. షాహిద్‌ వద్ద రెండు తులాల బంగారం, పది తులాల వెండితో పాటు రూ.35,550ల నగదును స్వాధీనం చేసుకున్నారు. స్థానిక అయ్యప్పనగర్‌ కాలనీలో గత నెలలో దొంగతనానికి గురైన ద్విచక్ర వాహనం సైతం షాహిద్‌ వద్దనే పోలీసులకు పట్టుబడింది. నిందితుడు షాహిద్‌ తాను దొంగిలించిన సొత్తుతో దిల్లీ, అజ్మీర్‌, రాజస్తాన్‌, తిరుపతి, షిరిడీ వెళ్లి ఖర్చు చేశారని, నిందితునిపై నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో మొత్తం 30 దొంగతనాల కేసులు నమోదై ఉన్నాయి. ఈ దొంగతనాన్ని ఛేదించడంలో కృషి చేసిన వారిని డీఎస్పీ అభినందించారు. డీఎస్పీ వెంట పట్టణ సీఐ రామకృష్ణ, పట్టణ ఎస్సైలు రవికుమార్‌, గోవింద్‌, ఏఎస్సై శ్రీనివాస్‌ తదితరులున్నారు.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here