అందంగా కనిపించేందుకు300 ప్లాస్టిక్‌ సర్జరీలు

0
1


అందంగా కనిపించేందుకు300 ప్లాస్టిక్‌ సర్జరీలు

వికారంగా ఉన్నావని తల్లి అనడంతో…

ఇంటర్‌నెట్‌డెస్క్‌: జపాన్‌కు చెందిన ఓ ప్రముఖ వ్యాఖ్యాత, మోడల్‌ అందంగా కనిపించడం కోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 300 ప్లాస్టిక్‌ సర్జరీలు చేయించుకుంది. అందుకోసం ఇప్పటి వరకు అయిన ఖర్చు అక్షరాలా 2,80,000 డాలర్లు. ప్రస్తుతం ఆమె వయస్సు 39 సంవత్సరాలు కాగా, గత 21 ఏళ్లుగా ఆమె సర్జరీలు చేయించుకుంటూనే ఉంది. ఇటీవల ఆమె జపాన్‌ జాతీయ మీడియాతో ఆ వివరాలు చెప్పింది.

వివరాల్లోకెళ్తే.. జపాన్‌కు చెందిన సుబాకి తమోమి తల్లి చిన్నప్పటి నుంచి ఆమెను నువ్వు అందంగా లేవు అంటూ ఉండేది. వికారంగా ఉన్నావంటూ ఇతరుల ముందు శరీరాకృతి గురించి విమర్శించేది. దీంతో ఎలాగైనా అందంగా మారాలని అప్పుడే నిర్ణయించుకున్నానని సుబాకి చెప్పింది. ఆమె తన 18వ ఏట మొదటి ప్లాస్టిక్‌ సర్జరీ, 20 ఏళ్లు వచ్చేసరికి దంతాలు, కళ్లు, ఉదర భాగంలో శస్త్ర చికిత్సలు చేయించుకుంది. యవ్వనంగా కనిపించేందుకు ప్లాస్టిక్‌ సర్జరీని ఓ మార్గంగా ఎన్నుకున్నట్లు ఆమె పేర్కొంది. అందంగా, యవ్వనంగా కనిపించేందుకు తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటానని, ఎటువంటి పరిస్థితుల్లో ఆపే ఉద్దేశం లేదని సుబాకి చెబుతోంది.  


 

Tags :

  • plastic surgery
  • japan model
  • motherSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here