అందరి సహకారంతో పరిశుభ్రత వైపు

0
1నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అందరి సహకారంతో ముందుకు వెళ్తూ గ్రామాలను పరిశుభ్రత వైపు తీసుకెళ్తున్నామని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఆయన శనివారం నాడు పలు మండలాల్లోను, గ్రామాలలోను పరిశుభ్రత పచ్చదనం పరిశీలించడానికి ఆకస్మికంగా పర్యటించి ఎక్కడికక్కడ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో అపరిశుభ్ర వాతావరణం ఉన్నచోట అధికారులను హెచ్చరించారు. ఎడపల్లి మండలం జానకంపేట, పోచారం, ఎడపల్లి మండల కేంద్రంలోను, బోధన్‌ మండలం మినార్‌పల్లి, బోధన్‌ మండల కేంద్రంలోను, రుద్రూర్‌ మండల కేంద్రంలోను, వర్ని మండలం సత్యనారాయణ పురం గ్రామంలో పర్యటించి నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్యక్రమాలు, మొక్కలు నాటడం తదితర కార్యక్రమాలను పర్యవేక్షించారు. బోధన్‌ మున్సిపాలిటీ పరిధిలో అపరిశుభ్ర వాతావరణం, మురుగు కాలువలు శుభ్రం చేయకపోవడం, పలు ప్రాంతాల్లో చెత్త పేరుకుపోవడం, ప్లాస్టిక్‌ను పడవేయడం, నీరు నిలిచి పోవడం తదితర పరిస్థితులను గమనించి మున్సిపల్‌ శానిటరీ ఇన్స్‌పెక్టర్‌ రామకష్ణ ను ప్రశ్నించారు. వెంటనే అన్నిచోట్ల పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి మోరీలు శుభ్రం చేయించి చెత్తను డంపింగ్‌ యార్డ్‌కు తరలించి ఫోటోలను తనకు పంపించాలని ఆదేశించారు. రెవెన్యూ డివిజనల్‌ అధికారి గోపిరామ్‌తో మాట్లాడుతూ మున్సిపల్‌ పరిధిలో అన్ని విభాగాల అధికారులు సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి పట్టణం శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తదుపరి ఇలాంటి అపరిశుభ్ర వాతావరణం కనిపిస్తే సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here