అక్కడ చింతపండు పెట్టి.. భార్యను చంపేసిన భర్త, మిస్టరీ వీడిందిలా!

0
1


‘‘నేను ఇంకా లైఫ్‌లో సెటిల్ కావాలి. అప్పటి వరకు పిల్లలు వద్దు. సేఫ్టీ పాటించి శృంగారంలో పాల్గొందాం’’ అని ఆమె భర్త ఎంతో ప్రేమగా చెప్పిన మాటలను ఆమె నమ్మంది. పిల్లలు కలగకుండా జాగ్రత్తలు పాటించింది. అయితే, సంభోగానికి ముందు ఆమె జననేంద్రియాల్లో చింత పండును చిన్న ఉండగా చుట్టి పెట్టడం ఆమెకు వింతగా అనిపించింది. ఓ రోజు అది ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించింది.

‘‘చింతపండు పెట్టి శృంగారంలో పాల్గొంటే పిల్లలు కలగరు. కొన్నాళ్లు ఇలాగే చేద్దాం’’ అని భర్త చెప్పాడు. అతడు శాస్త్రవేత్త కావడంతో ఆమె అంగీకరించింది. అలా అతడు ఆమె జననేంద్రియాల్లో చింతపండు పెట్టి శృంగారంలో పాల్గొన్నాడు. ఏడాది తర్వాత ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆసుపత్రిలో చేర్చితే కిడ్నీలు ఫెయిలైనట్లు వైద్యులు తెలిపారు. చివరికి చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు, అత్తమామలు ఆమెది సహజ మరణమని భావించారు.

Read also: అంగ స్తంభన సమస్య.. 53 మందిని రేప్ చేసి, దారుణంగా చంపేసిన ‘రాక్షసుడు’

ఆమెకు చికిత్స అందించిన వైద్యుల్లో అనుమానం కలిగింది. ఏడాది కిందట ఎంతో ఆరోగ్యం ఉన్నఆమె.. ఇలా తక్కువ సమయంలోనే కిడ్నీ ఫెయిలై చనిపోవడం ఏమిటనే సందేహం నెలకొంది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి.. ఆమె శవాన్ని అంత్యక్రియలకు తరలించవద్దని, పోస్టు మార్టం చేయాలని తెలిపారు. దీంతో శవాన్ని పోస్ట్‌మార్టంకు తీసుకెళ్లారు. ఆమె కిడ్నీ ఫెయిల్యూర్ వల్లే చనిపోయిందని నిర్ధారించారు. కానీ, రిపోర్టులో మాత్రం ప్రశ్నార్థకం పెట్టి పోలీసులకు ఇచ్చారు. దీంతో పోలీసులకు విషయం అర్థమైంది. ఆ కేసును అనుమానస్పద హత్యగా నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

Read also: అవి కోసి, శవాన్ని సూట్‌కేసులో కుక్కి.. మిస్టరీగా మారిన ఇన్‌స్టాగ్రామ్ స్టార్‌ హత్య!

హైదరాబాద్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ఒకప్పుడు సంచలనం సృష్టించింది. పోస్ట్‌మార్టం రిపోర్టులో అనుమానాలు వ్యక్తం చేసి ఉండకపోతే.. అంతా ఆమెది సహజ మరణమే అని అనుకొనేవారు. శవ పరీక్షలో కిడ్నీ ఫెయిల్యూర్ అని తెలిసినా.. వైద్యులకు వచ్చిన చిన్న అనుమానం హంతకుడిని పట్టించేలా చేసింది. తన పరిజ్ఞానాన్ని భార్య హత్యకు ఉపయోగించిన భర్త కుట్రను బట్టబయలు చేసింది.

Read also: అరటి పండు తగిలి ఆసుపత్రిపాలైన టీచర్, పరిస్థితి విషమం!

ఆమె శవాన్ని పోస్ట్‌మార్టం చేసిన మాజీ ఫోరెన్సిక్ స్పెషలిస్ట్, సైకాలజిస్ట్ డాక్టర్ వెంకట రావు ఓ యూట్యూబ్‌ చానల్‌కు చెప్పిన వివరాల ప్రకారం.. బెంగళూరులో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పోస్ట్‌గ్రాడ్యూయేషన్ చేసిన వ్యక్తికి.. భార్యపై అనుమానం కలిగింది. ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని ప్లాన్ చేశాడు. పోలీసులకు చిక్కకుండా సహజ మరణంగా చిత్రీకరించేందుకు తన పరిజ్ఞానాన్ని ఉపయోగించాడు. చింతపండులో ఓ కెమికల్(ఈ రసాయనం పేరును గోప్యంగా ఉంచాం) కలిపి, అది ఆమె జననాంగంలో పెట్టి శృంగారంలో పాల్గొనేవాడు. ఆ రసాయనం వల్ల ఆమె కిడ్నీలు ఫెయిలయ్యాయి. ఆసుపత్రిలో వైద్యులకు అనుమానం రాకుండా శవాన్ని అంత్యక్రియలకు తరలించి ఉంటే ఆ భర్త ఈ నేరం నుంచి తప్పించుకునేవాడే. కానీ, పోస్ట్‌మార్టం రిపోర్ట్ మిస్టరీని ఛేదించింది. నిండు ప్రాణాన్ని బలితీసుకున్న అతడు ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నాడు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here