అక్రమాస్తుల కేసు, పెన్నా సిమెంట్స్‌కు ఊరట

0
4


అక్రమాస్తుల కేసు, పెన్నా సిమెంట్స్‌కు ఊరట

హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులో ఇప్పటికే పలు సంస్థలకు ఊరట లభించింది. తాజాగా, ఈడీ నమోదు చేసిన కేసుల్లో పెన్నా సిమెంట్స్, పయనీర్ హాలీడే రిసార్ట్స్ లిమిటెడ్, ఎంబసీ ప్రాపర్టీ డెవలప్‌‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, దాని యజమాని జితేంద్ర వీర్వాణీలకు ఊరట లభించింది. ఈడీ చేపట్టిన ఆస్తుల జఫ్తును రద్దు చేస్తూ ఢిల్లీ అప్పీలేట్ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది.

నాటి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పెన్నా ప్రతాప్ రెడ్డికి చెందిన పెన్నా సిమెంట్స్, పయనీర్ హోటల్స్‌కు చేకూర్చిన లబ్ధికిగాను రూ.53 కోట్ల పెట్టుబడులను జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారనే అభియోగాలపై ఈడీ ఆస్తులను జఫ్తు చేసింది. ఈ అభియోగాలపై ఆధారాలు లేవని తాజాగా అప్పీలేట్ అథారిటీ పేర్కొంది.

వ్యాపార కార్యకలాపాల్ని ఎంతోకాలం ఫ్రీజ్ చేయరాదని, వీటిపై వందల మంది ఉద్యోగులు ఆధారపడి ఉంటారనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది. అవసరమైతే ఆ మేరకు డిపాజిట్స్‌ను తీసుకోవచ్చునని తెలిపింది. ఆస్తులను ఈడీ తన వద్ద జఫ్తు చేసుకోరాదని తెలిపింది. ఫిక్స్‌డ్ డిపాజిట్స్ తీసుకొని పయనీర్ హోటల్స్‌లో జఫ్తు చేసిన అంతస్తులను అప్పగించాలని ఆదేశించింది. ఆస్తులను జఫ్తు చేసుకోరాదని తెలిపింది.

అలాగే, ఎంబసీ ప్రాపర్టీ డెవలప్‌మెంట్ సహా దాని యజమాని జితేంద్ర వీర్వాణీలకు ఉపశమనం కలిగింది. ఎంబసీ ప్రాపర్టీ లిమిటెడ్‌కు చెందిన రూ.25.05 కోట్లు, దాని యజమాని జితేంద్ర వీర్వాణీలకు చెందిన రూ.19 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్స్ వాసపసు ఇవ్వాలని ఆదేశించింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here