అక్రమ వసూళ్లు తగదు

0
2


అక్రమ వసూళ్లు తగదు

దోమకొండ, న్యూస్‌టుడే: దోమకొండలోని దేసాయి బీడీ కంపెనీ టేకేదారు ఒకరు కార్మికుల నుంచి అక్రమంగా వసూలు చేస్తుండటంపై బీడీ అండ్‌ సిగార్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు నాగారపు ఎల్లయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. కంపెనీకి నోటీసు ఇవ్వడంతో బుధవారం సదరు టేకేదారుతో పాటు బీడీ కార్మికులను, ఎల్లయ్యను సంస్థకు పిలిపించి మేనేజర్‌ చర్చలు నిర్వహించారు. టేకేదారుని తొలగించి, కార్కానాను కంపెనీ వారే నిర్వహించాలని కార్మికులు డిమాండు చేశారు. చివరకు టేకేదారు, బీడీ కార్మికుల మధ్యన చర్చలు నిర్వహించి, సయోధ్య కుదిర్చారు. కార్యక్రమంలో టేకేదారుల సంఘం ప్రతినిధులు, బీడీ కార్మికులు పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here