అట్టహాసంగా మండల క్రీడలు

0
3


అట్టహాసంగా మండల క్రీడలు

కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎంపీపీ వాకిడి సంతోష్‌

వెల్మల్‌, న్యూస్‌టుడే: నందిపేట్‌ మండల అంతర్‌ పాఠశాలల క్రీడలు వెల్మల్‌ పాఠశాలలో సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. 20 ప్రభుత్వ, 8 ప్రైవేటు పాఠశాలలు ఇందులో పాల్గొన్నాయి. విద్యార్థులు తమ కళా ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. నృత్యాలు, నాటికలతో అలరించారు. ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసిన క్రీడా జెండా ఆవిష్కరించి, వందనం స్వీకరించారు. ఎంపీపీ వాకిడి సంతోష్‌ మాట్లాడుతూ.. విద్యార్థులు పోటీతత్వం అలవర్చుకోవాలని సూచించారు. మార్చ్‌ఫాస్ట్‌ ప్రదర్శన ఆకట్టుకుంది. అత్యుత్తమ ప్రతిభచాటిన వెల్మల్‌ పాఠశాలకు ప్రథమ, జడ్పీహెచ్‌ఎస్‌ నందిపేట్‌, ఖుదావంద్‌పూర్‌ పాఠశాలలు సంయుక్తంగా ద్వితీయ, బీసీ బాలుర గురుకులం నూతుపల్లి, కేజీవీబీ నందిపేట్‌కు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ప్రైవేటు పాఠశాల విభాగంలో అక్షర హైస్కూల్‌కు ప్రథమ, గీతా హైస్కూల్‌కు ద్వితీయ, కేటీఎస్‌కు తృతీయ స్థానం దక్కింది. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు ఎర్రం యమున, వైస్‌ఎంపీపీ గొజ్జి దేవేందర్‌, తహసీల్దార్‌ అలివేలు, ఎంపీడీవో నాగవర్ధన్‌, ఎంఈవో శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు మీనా, ఉపసర్పంచి నారాయణ, మాజీ సర్పంచులు దంసన్న, గంగుబాయి, ప్రతినిధులు సాయిరెడ్డి, సయ్యద్‌హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

రైతు, చాకలి ఐలమ్మ, పోతురాజు, తెలంగాణ తల్లి వేషధారణలో చిన్నారులుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here