అట్రాసిటీ కేసు నమోదు

0
5నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాటాపూర్‌ గ్రామానికి చెందిన జాదవ్‌ రవిపై దాడికి పాల్పడిన సంఘటన స్థలాన్ని బోధన్‌ ఏసీపీ రఘు పరిశీలించారు. వివరాల్లోకి వెళితే సాటాపూర్‌ గ్రామానికి చెందిన జాదవ్‌ రవిపై అదే గ్రామానికి చెందిన అమనుల్లా అనే వ్యక్తితోపాటు పలువురు దాడి చేసిన సంఘటనపై విచారణ చేపట్టారు. గత నెల రోజుల క్రితం జాదవ్‌ రవి వద్ద 6 వేల రూపాయలను అమాన్‌ తీసుకోగా, వాటిని తిరిగి ఇవ్వమని అమాన్‌ ఇంటికి వెళ్లిన రవిపై దాడితో పాటు కులం పేరుతో దూషించినట్లు తెలిపారు. బాధితుడిపై దాడి చేసిన వారిలో అమనుల్లాతో పాటు అజర్‌, షారుక్‌, అహ్మద్‌, ఎకర్‌ పాషా, మోహిన్‌, సాదిక్‌లతో పాటు మరో 25 మంది ఉన్నట్లు బాధితుడు పిర్యాదు చేసినట్లు ఎస్సై శంకర్‌ తెలిపారు. వీరిపై ఎస్సి, ఎస్టీ యాక్ట్‌ కింద అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. విచారణలో సిఐ షకీర్‌ అలీ, ఎడపల్లి ఎస్సై రాము నాయుడు ఉన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here