అతివలూ..ఆర్థికాభివృద్ధిరస్తు

0
1


అతివలూ..ఆర్థికాభివృద్ధిరస్తు

● కేంద్ర ప్రభుత్వ ‘ముద్ర పథకం’తో చేయూత

● జన్‌ధన్‌ ఖాతాదారులకూ వర్తింపు

న్యూస్‌టుడే, మోపాల్‌

మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉంటూ.. వివిధ పథకాల రుణాల ద్వారా స్వయం ఉపాధి పొందుతున్న అతివలకు కేంద్ర ప్రభుత్వం వరాన్ని ప్రకటించింది. ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకాన్ని వర్తింపజేస్తూ బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. వీరితోపాటు జన్‌ధన్‌ ఖాతాలు ఉన్న మహిళలకు సైతం అందించనుంది.

మహిళా సంఘాల సభ్యులు ప్రస్తుతం ప్రతి నెలా రూ.100 వరకు జమ చేస్తున్నారు. వీరు చేసిన పొదుపు ఆధారంగా బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాలను మంజూరు చేస్తారు. పొదుపు చేసిన మొత్తం, సభ్యుల ఆర్థిక స్తోమత, తీసుకున్న రుణాలతో వారు చేస్తున్న వ్యాపారాలు, చెల్లింపులు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఒక్కో సంఘానికి రూ.5-10 లక్షల వరకు రుణాలను అందిస్తున్నారు. ఈ మొత్తం సభ్యులందరూ పంచుకొంటే ఒక్కొక్కరి చేతికి తక్కువ మొత్తంలో డబ్బులు అందుతున్నాయి. ఫలితంగా పూర్తిస్థాయిలో ఆర్థిక చేయూత అందని పరిస్థితి. కేంద్రం రూపొందించిన ముద్ర పథకం ద్వారా పాత రుణాలతో సంబంధం లేకుండా ఒక్కో సభ్యురాలికి కనీసం రూ. లక్ష వరకు రుణాలు అందనుండటంతో ఆర్థిక స్వావలంబన చేకూరనుంది.

రూ.600 కోట్ల రుణాలు..
మహిళా సంఘాలకు 2019-20 ఆర్థిక సంవత్సరానికి రుణాల లక్ష్యాలను ప్రకటించింది. ప్రస్తుతం నిజామాబాద్‌ జిల్లాలో 787 గ్రామ సమాఖ్యలు, 22,737 సంఘాలున్నాయి. ఒక్కో సంఘంలో కనీసం 12 మంది సభ్యుల చొప్పున 2.5 లక్షలకు పైగా సభ్యులున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం రూ.202 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని లక్ష్యం ఉండగా.. ఇప్పటికే దాదాపు 5 వేల మందికి రూ.35 వేల చొప్పున అందజేశారు. స్త్రీనిధితోపాటు రూ.394 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను కలిపితే రూ.596 కోట్ల రుణాలు వీరికి అందనున్నాయి. వీటికితోడుగా ముద్ర పథకం రుణం అదనంగా అందనుంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here