అతివేగం ఇద్దరి ప్రాణాలు బలిగొంది

0
2నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అతివేగం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. కామారెడ్డి జిల్లా భిక్కనూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని 44వ నెంబరు జాతీయ రహదారిపై టోల్‌ప్లాజా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మత్యువాత పడ్డారు. సీఐ రాజశేఖర్‌ కథనం ప్రకారం… హైదారాబాద్‌ ఉప్పల్‌కు చెందిన శ్రీనివాస్‌ (37), స్వామి (30)లు వీరిద్దరు వరుసకు బావబావమరుదులు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండడంతో హైదరాబాద్‌ నుంచి ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. శ్రీనివాస్‌ బైక్‌ నడుపుతుండగా స్వామి వెనక కూర్చున్నాడు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో బైక్‌ టోల్‌ప్లాజా వద్ద ఉన్న డివైడర్‌ను ఢీకొట్టి టోల్‌ ప్లాజా బూత్‌ను తగిలింది. దీంతో ఇద్దరు కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. వారిని టోల్‌ ప్లాజా సిబ్బంది 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాస్‌ చికిత్స పొందుతూ మతి చెందాడు. స్వామి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ స్వామి మతి చెందాడు. భిక్కనూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here