అతి స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, ఎన్నికల తర్వాత 'భారీ పెంపు' వట్టిమాటే!

0
3


అతి స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, ఎన్నికల తర్వాత ‘భారీ పెంపు’ వట్టిమాటే!

న్యూఢిల్లీ: ఆదివారం నాడు పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. 5-6 పైసలు మాత్రమే పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌ను అనుసరించి చమురు ధరలు రోజు రోజుకు మారుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో పెట్రోల్ ధర శనివారం రూ.69.93గా ఉండగా, ఈ రోజు 5 పైసలు పెరిగి రూ.69.98గా ఉంది. డీజిల్ ధర రూ.63.78గా ఉండగా, నేడు 6 పైసలు పెరిగి 63.84కు చేరింది.

నోయిడాలో పెట్రోల్ ధర రూ.69.98, డీజిల్ ధర రూ.63.32, గురుగ్రామ్‌లో పెట్రోల్ రూ.70.50, డీజిల్ రూ.63.42గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ రూ.5 పైసలు పెరిగి రూ.72.19 (శనివారం) నుంచి ఈ రోజు రూ.72.24కు పెరిగింది. డీజిల్ 6 పైసలు పెరిగింది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 5 పైసలు పెరిగి రూ.75.63 (శనివారం) నుంచి ఈ రోజు రూ.75.68గా ఉంది. డీజిల్ 6 పైసలు పెరిగింది.

చెన్నైలు పెట్రోల్ ధర 5 పైసలు, డీజిల్ ధర 6 పైసలు పెరిగింది. పెట్రోల్ రూ.72.69గా, డీజిల్ రూ.67.52గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోను పెట్రోల్, డీజిల్ ధరలు 5 నుంచి 6 పైసలు మాత్రమే పెరిగాయి. హైదరాబాదులో పెట్రోల్ ధర రూ.74.37, డీజిల్ ధర రూ.69.58గా ఉంది. అమరావతిలో పెట్రోల్ ధర రూ.74.17, డీజిల్ రూ.69.03గా ఉంది. విజయవాడలో పెట్రోల్ ధర రూ.73.82గా, డీజిల్ ధర రూ.68.71గా ఉంది.

ఇదిలా ఉండగా, సార్వత్రిక ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయని, రూ.10 నుంచి రూ.15 వరకు పెరగవచ్చునని ఎన్నికల ఫలితాలకు ముందు ప్రచారం సాగింది. రూ.90కి చేరవచ్చునని వార్తలు వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ ఎన్నికల నేపథ్యంలో భారత్‌లో ధరలు పెంచలేదని, ఫలితాల తర్వాత భారీగా పెంపు ఉంటుందని భావించారు. అయితే ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు పెరుగుతున్నప్పటికీ, భారత్‌లో మాత్రం ఎన్నికల తర్వాత భారీగా పెరగలేదు. అంతర్జాతీయ మార్కెట్‌ను అనుసరించి స్వల్పంగా హెచ్చుతగ్గులు మాత్రమే ఉంటున్నాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here