అత్యంత విలువైన చేపను పట్టుకొని వదిలేశారు, ఖరీదు రూ.23 కోట్లు

0
3


అత్యంత విలువైన చేపను పట్టుకొని వదిలేశారు, ఖరీదు రూ.23 కోట్లు

ఐర్లాండ్‌లో ఓ వ్యక్తికి 8.5 అడుగుల పొడవు ఉన్న ట్యూనా చేప చిక్కింది. అయితే దానిని తిరిగి అతను సముద్రంలోనే వదిలి పెట్టాడు. వెస్ట్ కార్క్‌కు చెందిన డేవ్ ఎడ్వర్డ్ అనే వ్యక్తికి ఈ ట్యూనా చేప చిక్కింది. ఇటీవలి కాలంలో ఐరిష్ వాటర్‌లో పట్టుబడిన అతిపెద్ద చేప ఇది. దీని విలువ జపాన్‌లో 3 మిలియన్ల యూరోల వరకు ఉంటుంది. అంటే మన రూపాయల్లో దాదాపు రూ.23 కోట్లు.

అయితే డేవ్ ఎడ్వర్డ్, అతని టీమ్ సభ్యులు డారీన్ ఓ సులివాన్, వెల్డ్‌మాన్‌లు మాత్రం కమర్షియల్ కోణంలో చేపలు పట్టడం లేదు. వాస్తవానికి వారు అట్లాంటిక్ సముద్రంలో తాము ఉంటున్న ప్రదేశంలోని చేపల రకాలు, సంఖ్య కోసం క్యాచ్ అండ్ రిలీజ్ ప్రోగ్రామ్ చేపట్టారు. ఇందులో భాగంగా వారికి ట్యూనా చేప దొరికింది. ఈ భారీ ట్యూనా చేపల చిత్రాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

క్యాచ్ అండ్ రిలీజ్ ప్రోగ్రాంలో భాగంగా డేవ్ ఎడ్వర్డ్ అండ్ టీమ్ 15 బోట్లను తీసుకు వెళ్లింది. ఈ ప్రోగ్రామ్ అక్టోబర్ 15వ తేదీ వరకు సాగుతుంది. వీరికి పట్టుబడిన ట్యూనా చేప 270 కిలోల బరువు ఉంటుంది.

ఈ ట్యూనా చేపలు సాధారణమైనవేనని, చాలా పెద్దవిగా ఉంటాయని, ఈ సంవత్సరం డోనెగల్ బేకు దక్షిణాన పట్టుబడిన మొదటి చేప ఇది అని, నిజంగా చాలా పెద్దది అని పేర్కొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here