అదిరిపోయే ఆఫర్: రూ.777కే బైక్ ఇంటికి తీసుకెళ్లండి, కారు గెలవండి!

0
1


అదిరిపోయే ఆఫర్: రూ.777కే బైక్ ఇంటికి తీసుకెళ్లండి, కారు గెలవండి!

బైక్స్ ఇష్టపడేవారికి శుభవార్త. దసరా, దీపావళి వంటి పండుగ సీజన్లో వివిధ కంపెనీలు తమ తమ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఇస్తుంటాయి. పండుగ సందర్భంగా బైక్స్ ఇష్టపడేవారికి సుజుకీ టూ వీలర్స్ బంపరాఫర్ ప్రకటించింది. గత ఏడాది కాలంగా ఆటో సేల్స్ కూడా తగ్గాయి. ఈ నేపథ్యంలో వివిధ కార్లపై ఆయా కంపెనీలు రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఆఫర్ ప్రకటించాయి. సుజుకీ కూడా బైక్స్ పైన ఆఫర్లు తీసుకొచ్చింది. అన్ని టూవీలర్స్‌పై ఆఫర్ ఇస్తోంది.

స్పెషల్ ఆఫర్‌తో పాటు గిఫ్ట్

బైక్స్‌పై ఆఫర్‌తో పాటు అద్భుతమైన బహుమతులు కూడా ప్రకటించింది. 5 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ కాయిన్, మారుతీ సుజుకీ స్విఫ్ట్ వంటి వాటిని లక్కీ డ్రాలో పొందవచ్చు.

రూ.777కే బైక్ ఇంటికి తీసుకెళ్లవచ్చు

రూ.777కే బైక్ ఇంటికి తీసుకెళ్లవచ్చు

కొత్త బైక్ లేదా స్కూటర్‌ను ఈఎంఐలో కొనుగోలు చేస్తే డౌన్‌పేమెంట్ రూ.8,000 లేదా రూ.10,000 చెల్లించాలి. ఇది బైక్ ధరపై ఆధారపడి ఉంటుంది. కానీ ఇప్పుడు కేవలం రూ.777 చెల్లించి మీ ఇంటికి బైక్ తీసుకుపోయేలా ఆఫర్ ఇచ్చింది. తక్కువ డౌన్ పేమెంట్‌తో పాటు జీరో ప్రాసెసింగ్ ఫీజు.

సుజుకీ బైక్స్ పైన ప్రయోజనాలు...

సుజుకీ బైక్స్ పైన ప్రయోజనాలు…

– స్పాట్ లోన్ అప్రూవల్

– డౌన్ పేమెంట్ రూ.777

– 48 ఈఎంఐలు అందుబాటులో ఉన్నాయి.

– జీరో ప్రాసెసింగ్ ఫీజు

– ప్రభుత్వ ఉద్యోగులు, PSU ఉద్యోగులు, సెలెక్టెడ్ కార్పోరేట్ ఉద్యోగులకు రూ.3,000 వరకు ప్రయోజనాలు.

– పేటీఎం షాపింగ్ పైన రూ.8,500 వరకు బెనిఫిట్స్. (షరతులు వర్తిస్తాయి.)

-హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్యాష్ బ్యాక్ ఆఫర్ రూ.1500

– ఒక లక్కీ కస్టమర్ మెగా గిఫ్ట్ ఆఫర్ డ్రాలో భాగంగా మారుతీ సుజుకీ స్విఫ్ట్ గెలుచుకుంటారు.

– కస్టమర్లు 1 గ్రామ్, 2 గ్రాములు, 5 గ్రాముల గోల్డ్ కాయిన్స్ గెలుచుకునే అవకాశం ఉంది.

ఏయే బైక్స్‌పై ఆఫర్లు...

ఏయే బైక్స్‌పై ఆఫర్లు…

సుజుకీ యాక్సెస్ 125, బర్గ్‌మాన్ 125, గిక్సర్, ఇంట్రూడర్ వంటి వివిధ బైక్స్ పైన ఆఫర్లు వర్తిస్తాయి. అయితే ఈ ఆఫర్లు తమిళనాడు, పుదుచ్చేరి తప్ప మిగతా భారత దేశంలో మొత్తం ఉన్నాయి. కస్టమర్ల సౌలభ్యం కోసం ఆదివారం కూడా షాప్స్ తీసి ఉన్నాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here