అద్భుతం, ఆర్బీఐ నడిపిస్తోంది: రెపో రేటుపై ఆనంద్ మహీంద్రా

0
3


అద్భుతం, ఆర్బీఐ నడిపిస్తోంది: రెపో రేటుపై ఆనంద్ మహీంద్రా

ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్రా రెపో రేటు తగ్గడంపై స్పందించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 35 బేసిస్ పాయింట్స్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. కీలక వడ్డీ రేట్ల పైన కోత విధిస్తూ తీసుకున్న నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

ఈ నిర్ణయంతో దేశ వృద్ధిని ఆర్బీఐ ముందుండి నడిపిస్తోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నారు. ఎక్సలెంట్, చొక్కా చేతులు పైకి మడిచి జీడీపీ వృద్ధి అనే ఇంజిన్‌ను వేగంగా నడపాల్సిన అవసరం ఉందని నేను ఇందాకే ట్వీట్‌ చేశాను. నిజంగా ఆర్బీఐ దానిని ముందుండి నడిపిస్తోందని ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం రెపో రేటును 35 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. దీంతో రెపో రేటు 5.75 శాతం నుంచి 5.40 శాతానికి వచ్చింది. రెపో రేటు తగ్గడం వల్ల రుణాలపై వడ్డీ భారం మరింత తగ్గనుంది. మందగమన వృద్ధి రేటు నుంచి ఆర్థిక వ్యవస్థను పుంజుకునేలా చేసే ఉద్దేశ్యంలో భాగంగా రెపో రేటును తగ్గించింది.

దీంతో ఈ ఏడాది వరుసగా నాలుగోసారి రెపో రేటును తగ్గించినట్లు అయింది. గత మూడు పర్యాయాలు 35 బేసిస్ పాయింట్ల చొప్పున రెపో రేటు తగ్గించిన ఆర్బీఐ ఈసారి 35 బేసిస్ పాయింట్లు తగ్గించింది. నేడు ద్రవ్య పరపతి విధాన సమీక్ష వివరాలను ఆర్బీఐ వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది మూడో పరపతి సమీక్ష సమావేశం. స్వల్ప కాల రుణ వడ్డీ రేటు దీంతో 5.40 శాతానికి చేరుకుంది. రివర్స్ రెపో రేటును 5.15 శాతానికి సవరించింది. జీడీపీ వృద్ధి రేటును 6.9 శాతానికి తగ్గించింది.

ఆర్థిక వ్యవస్థలో ఉత్సాహం నింపేందుకు ప్రస్తుత వడ్డీ రేట్ల తగ్గింపు ఉపకరిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆర్బీఐ అప్పు రూపంలో బ్యాంకులకు ఇచ్చే మొత్తంపై వడ్డీ రేటును రెపో రేటు అంటారు. ఆర్థిక వ్యవస్థ కుదురుకోవడానికి వడ్డీ రేట్లు చాలా కీలకమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వాహన విక్రయాలు మందగించడం, మౌలిక రంగం వృద్ధి దిగజారడం, రుతుపవనాలు, స్టాక్ మార్కెట్ల క్షీణతపై ఆందోళనల నేపథ్యంలో ఆర్బీఐ వడ్డీ రేటును తగ్గించింది.

ఆరుగురు సభ్యుల MPCలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్, రవీంద్ర హెచ్ ధోలాకియా, మైఖేల్ దెబబ్రత పాత్రా, బిభు ప్రసాద్ కనుంగోలు 35 బేసిస్ పాయింట్స్‌కు ఓటు వేయగా, చెతన్ ఘతే, పమీ దువాలు 25 బేసిస్ పాయింట్స్‌కు ఓటు వేశారు. ఈ ఏడాదిలో ఆర్బీఐ రెపో రేటు 110 బేసిస్ పాయింట్స్ తగ్గింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here