అధికారులు అప్రమత్తంగా ఉండాలి

0
2


అధికారులు అప్రమత్తంగా ఉండాలి

పులాంగ్‌ ప్రాంతంలో పరిసరాలను చూస్తున్న పాలనాధికారి ఎంఆర్‌ఎం రావు, కమిషనర్‌ జాన్‌ సాంసన్‌

నిజామాబాద్‌ నగరం, న్యూస్‌టుడే: వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది కాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని పాలనాధికారి ఎంఆర్‌ఎం రావు ఆదేశించారు. నగర పాలక సంస్థ కమిషనర్‌ జాన్‌ సాంసన్‌తో కలిసి గురువారం ఖలీల్‌వాడి, ద్వారకానగర్‌, మిర్చి కంపౌండ్‌, వీకీ్లిమార్కెట్‌, కసాబ్‌గల్లీ, చంద్రనగర్‌, న్యాల్‌కల్‌ రోడ్డు, రోటరీనగర్‌, లలితానగర్‌, గాయత్రినగర్‌, గోల్‌హన్మాన్‌, పులాంగ్‌ ప్రాంతాల్లో పర్యటించారు. ఆయా చోట్ల లోతట్టు ప్రాంతాలను చూశారు. పారిశుద్ధ్య పనులు సక్రమంగా చేపట్టాలని ఇన్‌ఛార్జి ఎంహెచ్‌వోకు సూచించారు. బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌, ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంతాలు ప్రతి రోజు శుభ్రంగా ఉండాలన్నారు. న్యాల్‌కల్‌ రోడ్డు ప్రాంతంలో స్థానికంగా ఉండే వారు పలు రకాల సమస్యలను పాలనాధికారి దృష్టికి తీసుకవచ్చారు. కాలనీ వాసులతో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కమిషనర్‌కు చెప్పారు. పాలనాధికారి వెంటా డీసీపీ జలేందర్‌రెడ్డి, ఏసీపీ శ్యాం, ఎంఈ ఆనంద్‌ సాగర్‌, డీఈఈ రషీద్‌, ఇన్‌ఛార్జి ఎంహెచ్‌వో సాజీద్‌ అలీ, ఏఈలు, పారిశుద్ధ్య పర్యవేక్షకులు, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ఉన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here