అధికారుల సంకల్ప యాత్ర

0
4


అధికారుల సంకల్ప యాత్ర

బోధన్‌ పట్టణం, న్యూస్‌టుడే: బోధన్‌ పట్టణంలో సంకల్ప యాత్ర పేరిట ఆర్డీవో గోపీరామ్‌ సహా అధికారులు బుధవారం పాదయాత్ర నిర్వహించారు. గాంధీపార్కు నుంచి ఆజాంగంజ్‌ గాంధీ విగ్రహం వరకు పాదయాత్ర కొనసాగింది. స్వచ్ఛతా-హి-సేవా కార్యక్రమంలో భాగంగా కాలనీల మీదుగా వెళ్లిన ఆర్డీవో పారిశుద్ధ్య వ్యవస్థను పరిశీలించారు. అక్కడక్కడ మురుగు కాలువల్లో పేరుకున్న చెత్తను గుర్తించిన ఆయన జవాన్లను మందలించారు. ప్లాస్టిక్‌ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. పాదయాత్రలో కమిషనర్‌ స్వామినాయక్‌, తహసీల్దార్‌ రామకృష్ణ, డాక్టర్‌ శివప్ప పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here