అధిక రక్తపోటుతో కార్మికురాలి మృతి

0
0


అధిక రక్తపోటుతో కార్మికురాలి మృతి

బుచ్చమ్మ(పాతచిత్రం)

వీరన్నగుట్ట(రెంజల్‌), న్యూస్‌టుడే: వీరన్నగుట్టకు చెందిన పంచాయతీ కార్మికురాలు బుచ్చమ్మ(60) మంగళవారం సాయంత్రం అధిక రక్తపోటుతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వివరాలివీ.. పంచాయతీలో గత కొన్నేళ్లుగా పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తున్న బుచ్చమ్మతో పాటు ఐదుగురిని ఇటీవల విధుల నుంచి తొలగించారు. రెండు రోజుల పాటు పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మంగళవారం డీపీవో కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం కూడా ఇచ్చారు.

ఇంటికి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే ఆమె అధిక రక్తపోటుకు గురైనట్లు పేర్కొన్నారు. విధుల నుంచి తప్పించడం వల్లే ఆమె మానసిక ఒత్తిడికి లోనై అధిక రక్తపోటుకు గురై మృతిచెందిందని పారిశుద్ధ్య సిబ్బంది పేర్కొంటున్నారు. ఈ విషయమై సర్పంచి రాజును వివరణ కోరగా బుచ్చమ్మకు వయస్సు పైబడడం వల్లే తాత్కాలికంగా తప్పించామన్నారు.

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here