అనంతపుష్కరిణికి చేరుకున్న అత్తివరదస్వామి.. తిరిగి 2059లో పున:దర్శనం

0
2


అనంతపుష్కరిణికి చేరుకున్న అత్తివరదస్వామి.. తిరిగి 2059లో పున:దర్శనం

48 రోజుల పాటు భక్తులకు దర్శనమిచ్చిన తమిళనాడులోని కాంచీపురం అత్తివరద స్వామి తిరిగి అనంతపుష్కరిణిలోకి చేరుకున్నారు. శనివారం రాత్రి 12గంటలకు స్వామివారి పుష్కర ప్రవేశాన్ని ఆలయ అర్ఛకులు ఏకంతంగా నిర్వహించారు. ఈనేపథ్యంలోనే అర్ఛకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో 48రోజుల పాటు జరిగిన అత్తివరదస్వామి ఉత్సవాలు అంత్యంత వైభవంగా ముగిశాయి. ఇక తిరిగి మరో నలబై సంవత్సరాల తర్వాత అంటే 2059లో స్వామివారు తిరిగి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

తమిళనాడులోని కాంచీపురంలో ఆలయంలో నిర్వహించిన అత్తివరదరాజస్వామి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. స్వామివారు ఆలయంలోని అనంత పుష్కరిణిలోకి వెళ్లారు. స్వామివారి పుష్కర ప్రవేశాన్ని ఆలయ అర్చకులు ఏకాంతంగా నిర్వహించారు… అత్తివరదరాజ స్వామి విగ్రహం కోనేరు నుండి జనంలోకి వచ్చే మనోహర దృశ్యం 40 ఏళ్లకు ఓసారి జరుగుతుంది. విష్ణుమూర్తి అవతారమైన అత్తివరదరాజస్వామి 1979లో భక్తులకు దర్శనమిచ్చారు. తిరిగి ఈ ఏడాది జులై 1న ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నీటీ నుండి బయటకు వచ్చి తొమ్మిది అడుగుల స్వామివారు 31 రోజుల పాటు శయన అవతారంలో దర్శనమిచ్చి, ఆగస్టు 1 నుంచి నిలబడిన అవతారంలో దర్శనమిచ్చారు. కాగ మొత్తం 48 రోజుల పాటు భక్తులకు దర్శనమిచ్చిన అత్తి వరదరాజస్వామి భక్తులకు మళ్లీ 2059లో దర్శనమివ్వనున్నారు.

కాగా దక్షిణాపథంలో ఉన్న ఏకైక మోక్షపురి కంచిలో ఉన్న ప్రసిద్ది చెందిన ఆలయాల్లో శ్రీ వరదరాజ స్వామి దేవాలయం ఒకటి. 108 దివ్వతిరుపతులలో ఒకటై ప్రధానమైన వైష్ణవ దివ్వక్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. తమిళుల ఆరాధ్యదైవంగా… కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా కాంచీపురంలో అత్తివరదస్వామి కొలువై ఉన్నాడు. ఉదయం, సాయంత్రం రెండు పూటలు స్వామికి సహస్రనామార్చన జరుగుతుంది. ఉదయం 6 గం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులు దర్శించుకున్నారు.. దీంతో నలబై సంవత్సరాలు ఒకసారి దర్శనమిచ్చే అత్తివరద స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటుత్తుతారు. ప్రతి రోజు ఐదు లక్షల మంది భక్తులు సరాసరిన దర్శించుకున్నట్టు సమాచారం. ఇక తెలంగాణ సిఎం కేసిఆర్ సైతం స్వామివారిని దర్శించుకున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here