అనగనగా.. ఓ డ్రెస్సు కథ..!

0
5


అనగనగా.. ఓ డ్రెస్సు కథ..!

ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ‘హాట్‌4 ది స్పాట్‌’ పేరుతో ఓ పేజీ

బ్రిటన్‌లోని ‘జరా’ వస్త్ర దుకాణం అనతికాలంలోనే యువతను ఆకట్టుకుంటూ ప్రఖ్యాతి గాంచింది. దీనికి కారణం ఆ స్టోర్ తీసుకువచ్చిన ఓ డిజైన్‌. ప్రస్తుతం ఆ డ్రెస్‌ డిజైన్‌ బ్రిటన్‌ మొత్తం వైరల్‌ అయింది. అంతేనా.. ఈ ‘దుస్తులు’ వేసుకున్న వారిని గుర్తించి, వారి ఫొటోలు పోస్ట్‌ చేసేందుకు ఓ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ఉందంటే నమ్ముతారా..! 

స్టైలిస్ట్ ఫయే ఓకెన్‌ఫుల్ ఈ దుస్తులకు వస్తున్న ప్రజాదరణ చూసి ‘హాట్ 4 ది స్పాట్’ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ప్రారంభించారు. ఈ ఖాతా గురించి డిస్‌క్రిప్షన్‌లో ‘దుస్తులు ధరించడానికి సురక్షితమైన స్థలం’ అని ఉంటుంది. ఇప్పుడు ఈ తరహా దుస్తులు ధరించిన వ్యక్తులను గుర్తించడంపై నెటిజన్లు దృష్టి పెట్టారు. అలా దొరికిన వారి ఫొటోలను ఇన్‌స్టా ఖాతాలో అప్‌లోడ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాకు 11 వేలకు పైగా మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. 
ఈ ఖాతాలో డ్రెస్సును గురించి క్రమం తప్పకుండా పోస్ట్‌ చేస్తుంటారు. ఈ దుస్తులపై ప్రత్యేకంగా ‘మీమ్స్‌’ కూడా రూపొందించి పోస్ట్‌ చేస్తుంటారు. ఈ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాపై కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ, ఈ తరహా ఖాతా ఇదొక్కటే కాదు. చిరుతపులి, మిడ్‌ స్కర్ట్‌లకు సంబంధించిన ఖాతాలు అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఇదివరకే ఉన్నాయి.

తెల్లటి రంగుపై నల్లటి చుక్కలతో ఈ గౌను యువతులను ఇట్టే ఆకట్టుకుంటోంది. అందరికి సౌకర్యవంతంగా ఉండటంతో ఈ గౌన్‌ను అభిమానించేవారి సంఖ్య ధరించేవారి సంఖ్య ఎక్కువవుతోంది. ఈ డ్రస్‌కు అదనంగా కొత్తకొత్త డిజైన్లు జోడించడంతో ప్రత్యేకంగా కనిపిస్తున్నామని యువతులు చెబుతున్నారు.  రౌండ్‌నెక్‌, మోచేతి వరకు స్లీవ్స్‌, వెనకవైపు బటన్‌లతో సౌకర్యవంతంగా ఉంటుంది. దీని ధర 69.90 డాలర్‌లు. 

‘‘ఈస్టర్‌ సమయంలో ఓ ఆర్ట్ డైరెక్టర్, మేకప్ ఆర్టిస్ట్ వీటిని ధరించడం చూశాను. దీన్ని ఆయన ఫొటో తీసి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ‘ఇబ్బందికరమైన ఫ్యాషన్ క్షణం’ అని పోస్ట్‌ చేశారు. చాలా మంది వీక్షకులు తమ అభిప్రాయాలు పంచుకోవడంతో కొన్ని వారాల తర్వాత ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఇది చాలా ప్రాచుర్యం పొందింది. దీంతో ఈ తరహా ఫొటోలు పోస్ట్‌ చేయడానికి కొత్త అకౌంట్‌ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను’’

– ఫయే ఓకెన్‌ఫుల్‌

 

Tags :

  • dress
  • instagram
  • britain



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here