అనారోగ్యంతో భారత మాజీ ఓపెనర్ కన్నుమూత!!

0
3


ముంబై: భారత మాజీ టెస్ట్ ఓపెనర్ మాధవ్‌ ఆప్టే (86) సోమవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మాధవ్‌ ఆప్టే ముంబైలోని బ్రీచ్‌ కాండే హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. మాధవ్‌ వచ్చే నెల ఐదో తేదీన 87వ ఒడిలో అడుగుపెట్టనున్న తరుణంలో.. కన్నుమూయడం కుటుంబ సభ్యుల్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. మాధవ్‌ ఆప్టే మరణవార్తతో పలువురు క్రికెటర్లు నివాళులు అర్పించారు.

జాగ్రత్త.. తొలి ఎన్‌బీఏ బాస్కెట్ బాల్ మ్యాచ్ కోసం భారత్‌కు వస్తా: ట్రంప్

ఏడు టెస్టులకు ప్రాతినిధ్యం:

ఏడు టెస్టులకు ప్రాతినిధ్యం:

1950లో భారత టెస్టు ఓపెనర్‌గా మాధవ్‌ ఆప్టే సేవలందించారు. మాధవ్‌ భారత్ తరపున ఏడు టెస్టులకు ప్రాతినిధ్యం వహించారు. అయితే ఈ ఏడు టెస్టుల్లో వెస్టిండీస్‌పైనే ఐదు టెస్టులు ఆడడం విశేషం. మాధవ్‌ వెస్టిండీస్‌ దిగ్గజ బౌలర్లు ఫ్రాంక్‌ కింగ్‌, జెర్రీ గోమెజ్‌, ఫ్రాంక్‌ వారెల్‌ వంటి అటాకింగ్‌ బౌలింగ్‌ను ఎదుర్కొని రెండు సెంచరీలు చేశారు. ఈ రెండు సెంచరీలు పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ మ్యాచ్‌ల్లోనే చేయడం మరో విశేషం.

 కెరీర్‌లో 542 పరుగులు:

కెరీర్‌లో 542 పరుగులు:

మాధవ్ తన టెస్ట్ కెరీర్‌ను 542 పరుగులలో (సగటున 49.27) ముగించారు. టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 163. వెస్టిండీస్‌లో ఇంత విజయవంతమైన రికార్డు ఉన్నప్పటికీ.. ఆయన మళ్లీ భారత్ తరఫున ఆడటానికి ఎంపిక కాలేదు. ఓవరాల్‌గా 67 ఫస్ట్‌క్లాస్‌ (మూడు మ్యాచ్‌లు బెంగాల్‌కు, 64 మ్యాచ్‌లు ముంబైకి) మ్యాచ్‌లు ఆడిన మాధవ్‌ 3,336 పరుగులు చేశారు. ఇందులో ఆరు సెంచరీలు, 16 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

అధ్యక్షునిగా కీలక నిర్ణయం:

అధ్యక్షునిగా కీలక నిర్ణయం:

మాధవ్ ముంబైలోని ప్రసిద్ధ క్రికెట్‌ క్లబ్‌ ఆఫ్​ ఇండియా (సీసీఐ) అధ్యక్షునిగా కూడా పని చేశారు. తన పదవీకాలం (1987-88)లో క్లబ్‌లో తీసుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆటగాళ్ల వయసు విషయంలో కచ్చితమైన నిబంధనల్ని ఆయన అమలు చేశారు. వయోపరిమితి నిబంధనలను సర్దుబాటు చేయడం ద్వారా.. క్రికెట్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా తరుఫున 15 ఏళ్ల వయసులో సచిన్‌ టెండూల్కర్‌ ప్రాతినిథ్యం వహించారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here