అనిల్ అంబానీ రిలయన్స్ ఇన్‌ఫ్రాకు రూ.7,000 కోట్ల ప్రాజెక్టు

0
1


అనిల్ అంబానీ రిలయన్స్ ఇన్‌ఫ్రాకు రూ.7,000 కోట్ల ప్రాజెక్టు

న్యూఢిల్లీ: రూ.7,000 కోట్ల వెర్సోవా-బాంద్రా సీ లింక్ ప్రాజెక్టు కాంట్రాక్ట్‌ను అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దక్కించుకుంది. మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (MSRDC) నుంచి ఈ ప్రాజెక్టును దక్కించుకుంది. ఈ మేరకు రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బుధవారం నాడు ప్రకటన చేసింది.

17.17 కి.మీ. మేర నిర్మించనున్న ఈ ప్రాజెక్టు బాంద్రా-వర్లీ సీలింక్ ప్రాజెక్టు కంటే మూడు రెట్లు పెద్దది. బాంద్రా-వర్లీ సీలింక్ ప్రాజెక్టు ప్రాజెక్టు 5.6 కిలో మీటర్లు. ఈ నెల 24 నుంచి అరవై నెలల్లోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని రిలయన్స్ ఇన్‌ఫ్రా ఓ బీఎస్‌ఈ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఈ ప్రాజెక్టు నిరమాణం వల్ల ముంబై వాసులకు రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం 90 నిమిషాల నుంచి 10 నిమిషాలకు తగ్గుతుందని రిలయన్స్ ఇన్‌ఫ్రా తెలిపింది.

గత వారం రేటింగ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్.. రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లాంగ్ టర్మ్ ఇష్యూయర్ రేటింగ్‌ను తగ్గించింది. ఇప్పటికే భారీ నష్టాలతో నెట్టుకుంటూ వస్తున్న రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు ఈ భారీ ప్రాజెక్టుతో ఊరట లభిస్తుందని భావిస్తున్నారు.

మరోవైపు, ఈ ప్రాజెక్టు దక్కించుకున్న నేపథ్యంలో రిలయన్స్ అడాగ్ షేర్లు మార్కెట్లో దూసుకుపోతున్నాయి. ఇంట్రాడేలో నేడు (జూన్ 26) రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేర్లు 15 శాతం పెరిగాయి. మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో బీఎస్ఈలో స్టాక్ రూ.6.90 పెరిగి 58.80 వద్ద ట్రేడ్ అయింది. 13.29 శాతం పెరిగినట్లు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here