అనుమతి లేకుండా నిర్వహిస్తున్నమందుల దుకాణం

0
0


అనుమతి లేకుండా నిర్వహిస్తున్నమందుల దుకాణం

సీజ్  చేసిన ఔషధ నియంత్రణ అధికారులు

నిజామాబాద్‌: నిజామాబాద్ నగరంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఏజెన్సీ ని ఔషధ నియంత్రణ అధికారులు సీజ్ చేశారు. రూ.5 లక్షల విలువ చేసే రోగ నిర్ధరణ పరికరాలు సీజ్ చేశారు. వీక్లి మార్కెట్ రోడ్డులో ఓ ఇంట్లో అనుమతి లేకుండా రక్త పరీక్షలు నిర్వహించే కిట్ లు, రోగ నిర్ధరణ పరీక్షలు చేసే పరికరాలు, రక్త పరీక్షలు చేసేందుకు అవసరమైన రసాయనాలు అమ్ముతున్నారు. 2009 లో పోలీస్ లైన్, ఎల్లమ్మ గుట్ట పేరుతో అనుమతి తీసుకుని అక్కడి నుంచి ఖలీల్ వాడీ, ఆ తర్వాత ఇప్పుడు వీక్లి మార్కెట్ లో ఓ ఇంట్లోకి ఏజెన్సీ మార్చారు. ఇటీవల బోధన్ లో ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో రక్తం నిల్వ చేసే బ్యాగ్ దొరికినప్పుడు అక్కడి సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు తనిఖీలు చేశారు.

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here