అనుమానాస్పద స్థితిలో బాలుడి మృతి

0
2


అనుమానాస్పద స్థితిలో బాలుడి మృతి

వాడి(ధర్పల్లి), న్యూస్‌టుడే: ధర్పల్లి మండలంలోని వాడి గ్రామానికి చెందిన సుంకరి నివాస్‌(15) ఆదివారం అనుమానాస్పదంగా మృతి చెందినట్లు ఎస్సై పాండేరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. సుంకరి భూపాల్‌, కల్పన దంపతుల కుమారుడు నివాస్‌ తన తాతతో కలిసి పొలానికి వెళ్లాడు. అక్కడ రసాయన మందులు చల్లి.. ఇంటికి తిరిగి వస్తుండగా స్పృహకోల్పోయి పడిపోయాడు. కుటుంబ సభ్యులు బాలుడిని జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. రసాయన మందు చల్లిన తర్వాత చేతులు సరిగా శుభ్రం చేసుకోకుండా నీళ్లు తాగడంతో ఇలా జరిగిందేమోనని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. బాలుడి తండ్రి ఉపాధి కోసం గల్ఫ్‌ దేశానికి వెళ్లాడు. నివాస్‌ హోన్నాజీపేట్‌ జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here