అన్నదాన సత్రం కార్యదర్శిగా చాట్ల రాజేశ్వర్‌

0
0నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం గౌరవాధ్యక్షులు చాట్ల రాజేశ్వర్‌ బాసర అన్నదాన సత్రం కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం వారు ఘనంగా సన్మానించారు. పట్టణ అధ్యక్షుడు షేర్ల లక్ష్మణ్‌, కార్యదర్శి సబ్బని కష్ణ హరి, శిలసాగర్‌, సబ్బని శంకర్‌, క్యాతం దూసా వెంకటస్వామి, సిద్ధిరాములు, పడిగే రాములు, జిల్లా వర్కింగ్‌ సెక్రటరీ బొమ్మ రాజయ్య, సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాట్ల రాజేశ్వర్‌ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యత అప్పగించినందుకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని, పద్మశాలి ప్రజలకు సేవచేసే భాగ్యం కల్పించారని, ఈ బాధ్యతలు తనకు అప్పగించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తర్వాత సంఘ భవనంలో జాతీయ జెండా ఆవిష్కరించి, రక్షాబంధన్‌ సందర్భంగా యజ్ఞోపవీత ధారణ చేశారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here