అన్నా క్యాంటీన్లలో 150కోట్ల స్కామ్ అన్న విజయసాయి .. పేదల కడుపు మాడ్చే పైశాచిక ఆనందం మీదన్న బుద్దా

0
0


అన్నా క్యాంటీన్లలో 150కోట్ల స్కామ్ అన్న విజయసాయి .. పేదల కడుపు మాడ్చే పైశాచిక ఆనందం మీదన్న బుద్దా

ఏపీలో వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుండీ కావాలని కక్షపూరితంగా వ్యవహరిస్తుందని టీడీపీ విమర్శిస్తుంది. ప్రతీ రోజు ఏదో ఒక అంశంపై ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. తాజాగా అన్న క్యాంటీన్ల విషయంలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి . అన్నా క్యాంటీన్లను సర్కారు మూసివేస్తోందంటూ టీడీపీ మండిపడుతుంటే , అన్న క్యాంటీన్ల ఏర్పాటులో కూడా పెద్ద కుంభకోణం ఉందంటూ తాజాగా వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశారు. దీంతో టీడీపీ అగ్గి మీద గుగ్గిలం అవుతుంది .

అన్న క్యాంటీన్ల నిర్మాణంలో రూ.150 కోట్ల మేర కుంభకోణం జరిగిందన్న విజయసాయి

వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఎన్నికల ముందు ప్రజల్ని ప్రలోభపెట్టేందుకే చంద్రబాబు సర్కారు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసిందని ఆరోపణలు గుప్పించారు. అన్న క్యాంటీన్ల నిర్మాణంలో రూ.150 కోట్ల మేర కుంభకోణం జరిగిందని ఆయన ట్వీట్ చేశారు. టీడీపీ అవినీతి చివరకు పేదలకు భోజనం పెట్టే పథకంలో కూడా సాగిందని ఆయన ఆరోపించారు. పేదవాళ్లకు అతి తక్కువ ధరకు భోజనం పెట్టే పథకంలో కూడా దోచుకున్నారంటూ మండిపడ్డారు విజయసాయి రెడ్డి . రూ.2 లక్షలతో నిర్మించే క్యాంటీన్ కు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చయిందంటూ లెక్కలు చూపారని విజయసాయి విమర్శల వర్షం కురిపించారు .

  విజయసాయి రెడ్డి పై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫైర్..
   మండిపడుతున్న టీడీపీ ... ఘాటుగా బదులిచ్చిన బుద్దా వెంకన్న

  మండిపడుతున్న టీడీపీ … ఘాటుగా బదులిచ్చిన బుద్దా వెంకన్న

  ఇక ఇప్పటికే ఆగ్రహంతో ఉన్న టీడీపీ నేతలు విజయసాయి వ్యాఖ్యలపై మండి పడ్డారు. నోటికి ఎంతోస్తే అంత చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు .గత ప్రభుత్వం నిర్మించిన అన్న క్యాంటీన్లను జగన్ సర్కారు మూసివేయడం పట్ల టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో రగిలిపోతున్నారు. ఇక ఒక్కో అన్న క్యాంటీన్ ను రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల ఖర్చుతో నిర్మించారని, పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్ల నిర్మాణంలో కూడా దోచుకున్నారంటూ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఘాటుగా స్పందించారు.

  మీ అధినేత మతయాత్ర కోసం ప్రజాధనం ఖర్చు .. పేదల ఆకలి తీరిస్తే తప్పా అన్న బుద్దా

  మీ అధినేత మతయాత్ర కోసం ప్రజాధనం ఖర్చు .. పేదల ఆకలి తీరిస్తే తప్పా అన్న బుద్దా

  అన్న క్యాంటీన్లు మూసెయ్యలేదని కొందరు వైసీపీ నేతలు చెప్తున్నారని , ఇక అన్న క్యాంటీన్లు మూసేసి పేదల కడుపులు కాలుస్తున్న పైశాచిక ఆనందం మీ మాటల్లో కనిపిస్తోందంటూ విజయసాయిరెడ్డికి కౌంటర్ వేశారు. పేదలకు భోజనం పెట్టె స్కీమ్ లోనూ స్కామ్ లు వెతుకుతున్నరంటూ మండిపడ్డారు . అన్నా క్యాంటీన్ ల నిర్మాణంలో ఎలాంటి అవకతవకలు లేవన్న బుద్దా చాలా ఘాటుగా స్పందించారు . నాలుగు రోజుల పాటు మతయాత్ర చేస్తున్న మీ అధినేత సెక్యూరిటీ కోసం రూ.22.52 లక్షల ప్రజాధనం ఖర్చు చేస్తున్నారు . అలాంటిది నిత్యం వేల సంఖ్యలో పేదవాళ్లకు ఏళ్ల తరబడి ఆకలి తీర్చే , భోజన సేవలు అందించే అన్న క్యాంటీన్ ను రూ.35 లక్షలతో నిర్మించకూడదా? అంటూ బుద్ధా వెంకన్న విజయసాయిని సూటిగా ప్రశ్నించారు .  Source link

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here