అన్న పోలీసు, చెల్లి మావోయిస్టు.. ఒకరిపై ఒకరు ఎదురుకాల్పులు, చివరికి..

0
3


న్నాచెల్లెల్ల వింత గాధ ఇది. ఒకే తల్లికి పుట్టిన ఆ అడవి బిడ్డల సిద్ధాంతాలు వేర్వేరు. అన్న పోలీసుగా మారి ప్రజలకు సేవలందిస్తుంటే.. చెల్లి మావోయిస్టుగా అడవి బాట పట్టింది. అన్నను వదిలి అన్నలతో కలిసి ఉద్యమిస్తోంది. ఇటీవల ఆ అన్నాచెల్లెల్లు ఎదురుపడ్డారు. అప్యాయంగా పలకరించుకోడానికి బదులు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు.

చత్తీస్‌ఘడ్‌‌కు చెందిన కమాండర్ వెట్టి రామ ఆధ్వర్యంలో జులై 29న 140 మంది పోలీసులు సుక్మా జిల్లాలోని బలేంగ్తాన్‌లో మావోయిస్టుల క్యాంపును చుట్టుముట్టారు. కొంటా ప్రాంతానికి చెందిన సీపీఎం (మావోయిస్టు) కమిటీకి చెందిన ముఖ్య సభ్యుల కోసం జల్లెడపట్టారు. ఈ సందర్భంగా ఓ మహిళా మావోయిస్టు రామ కంటపడింది. ఆమె మరెవ్వరో కాదు.. వెట్టి రామ చెల్లి వెట్టి కన్నీ.

Read also: రెట్ట తెచ్చిన తంట.. రాళ్ల మధ్య ఇరుక్కుని 4 రోజులు నరకయాతన!

వెట్టి కన్నీపై రామ కాల్పులు జరపలేదు. ఆమెను లోంగిపోవాలని కోరాడు. అయితే, కన్నీకి భద్రతగా ఉన్న మిగతా సభ్యులు రామపై కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తు అతడు కాల్పుల నుంచి తప్పించుకున్నాడు. ఎదురు కాల్పులు జరిపేసరికి ఆమె అక్కడ నుంచి దట్టమైన అడవుల్లోకి పారిపోయింది.

మావోయిస్టు నుంచి పోలీసుగా మారిన రామ: గగన్‌పల్లి గ్రామానికి చెందిన రామ, కన్నీలు 1990లో మావోయిస్టుల ఉద్యమంలో చేరారు. సంఘం అనే బాలల దళంలో చేరిన ఆ ఇద్దరూ మావోయిస్టుల సిద్ధాంతాలను పునికిపుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వెట్టి రామ మాట్లాడుతూ.. ‘‘అప్పటితో పోల్చితే మావోయిస్టు ఉద్యమంలో చిత్తశుద్ధి లోపించింది. అందుకే 2018లో నేను పోలీసులకు లొంగిపోయాను. కానీ చెల్లి మాత్రం దళంలోనే ఉండిపోయింది. ఆ తర్వాత పోలీసులతో కలిసి 10 భారీ ఆపరేషన్లలో పాల్గొన్నాను. కొద్ది నెలల తర్వాత నాకు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది’’ అని తెలిపారు.

Read Also: డేంజర్ డాగ్స్.. కుక్క నాకడంతో కాళ్లు, చేతులు పోగొట్టుకున్న మహిళ!

చెల్లిపై కాల్పులు జరపాలనుకోలేదు: ‘‘మావోయిస్టుల కోసం గాలిస్తున్న సమయంలో చెల్లి కన్నీ ఎదురైంది. ఆమెపై కాల్పులు జరపాలని నేను అనుకోలేదు. కానీ, సెకన్ల వ్యవధిలో ఆమె గార్డులు నన్ను, టీమ్‌ను లక్ష్యం చేసుకుని కాల్పులు జరిపారు. కొద్ది నిమిషాల తర్వాత ఆమె కూడా కాల్పులు జరుపుతూ అడవిలోకి వెళ్లిపోవడం చూశాం’’ అని రామ తెలిపారు. మావోయిస్టు దళంలో కీలక నేతగా ఎదిగిన కన్నీ తలపై రూ.5 లక్షల రివార్డు ఉంది. మరి, ఆ అన్నా చెల్లెల్లు తిరిగి కలుస్తారా, లేదా కలవకుండానే కథ ముగుస్తుందా అనేది కాలమే చెబుతుంది.
Photo credit: Hindustan TimesSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here