అన్వేషణ (బాలమేధావుల) ఆవిష్కరణ

0
2


అన్వేషణ (బాలమేధావుల) ఆవిష్కరణ

‘బాలల సైన్స్‌ కాంగ్రెస్‌’ జాతీయ ప్రదర్శనకు 13 మంది ఎంపిక

ఖమ్మంలో ముగిసిన రాష్ట్రస్థాయి ప్రదర్శన

‘స్వచ్ఛత’, ‘పచ్చదనం’, ‘ఆరోగ్య సంరక్షణ’ అంశాలపై 10 నుంచి 17 ఏళ్ల లోపు బాలలు వినూత్న ఆలోచనలతో వెలువరించిన నవ్యావిష్కరణలు ఎంతో ఆకట్టుకున్నాయి. 27వ ‘జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌’ రాష్ట్రస్థాయి ప్రదర్శన ఈనెల 15, 16 తేదీల్లో ఖమ్మం నగరంలోని హార్వెస్ట్‌ పాఠశాలలో కొనసాగింది. కేంద్ర సైన్స్‌, టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కమ్యూనికేషన్‌ (ఎన్‌సీఎస్‌టీసీ) కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ ప్రదర్శనను అకడమిక్‌ కమిటీ కేంద్ర పరిశీలకురాలు డాక్టర్‌.గీతా స్వామినాథన్‌ పర్యవేక్షించారు. బాలల్లో విజ్ఞాన వికాసం ద్వారా ‘అన్వేషణాత్మక ఆవిష్కరణ’ విద్యను దేశవ్యాప్తంగా ఉద్యమంలా విస్తరింపజేయడమే ఈ ప్రదర్శన ముఖ్య లక్ష్యం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఉత్సాహంగా హాజరైన బాలలు పలు సామాజిక సమస్యలకు నవ్యతతో కూడిన పరిష్కారాన్ని చూపుతూ నమూనాలు ప్రదర్శించారు. వీరిలో తెలంగాణ వ్యాప్తంగా 139 మంది హాజరవగా వారిలో 13 మందిని జాతీయ స్థాయి ప్రదర్శనకు నిర్వాహకులు సోమవారం ఎంపిక చేశారు. డిసెంబరు 27 నుంచి 31 వరకు జాతీయ స్థాయి ప్రదర్శన కేరళలో జరగనుంది. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించనున్న బాల మేధావుల ప్రతిభపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

– ఖమ్మం విద్యా విభాగం, న్యూస్‌టుడే

 

పూర్తి కథనం కోసం… క్లిక్‌ చేయండిSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here