అపరిశుభ్ర వాతావరణం ఉండకూడదు

0
1నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో పట్టణాల్లో ఎక్కడ కూడా అపరిశుభ్ర వాతావరణం ఉండకూడదని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన వేల్పూర్‌ మండలం అంక్సాపూర్‌ గ్రామంలో నిర్వహిస్తున్న 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ గ్రామానికి వచ్చే ముఖ్య రహదారులను పరిశుభ్రంగా ఉండేలా చూడాలని తెలిపారు. ఎక్కడ కూడా మురుగునీరు నిల్వ ఉండకుండా, ప్లాస్టిక్‌ కనిపించకుండా చూడాలన్నారు. ఎప్పటికప్పుడు వీధులు, మోరీలు శుభ్రం చేస్తూ చెత్తను డంపింగ్‌ యార్డ్‌లకు తరలించాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో వైకుంఠ ధామాలు ఏర్పాటు చేయాలన్నారు. పిచ్చి మొక్కలని తొలగించి శిథిల భవనాలను కూల్చివేయాలని తెలిపారు. అన్ని ప్రాంతాల్లో పరిశుభ్రతతో పాటు పచ్చదనం కొరకు మొక్కలు నాటాలని, ప్రతి ఇంటికి మొక్కలను అందించాలని దోమలు రాకుండా తులసి, కష్ణ తులసి, రోజ్‌ మేరీ మొక్కలు నాటేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here