అపర కుబేరుడు ఈ అంబానీ: విదేశంలో పుట్టి.. స్వదేశంలో సంపద స‌‌ృష్టించి…

0
4


అపర కుబేరుడు ఈ అంబానీ: విదేశంలో పుట్టి.. స్వదేశంలో సంపద స‌‌ృష్టించి…

రిలయన్స్ అన్నా.. జియో అన్నా… మనకు గుర్తుకొచ్చేది ఒకరే. ముఖేశ్ అంబానీ. దేశంలోని కుబేరుల్లో రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ (ఆర్‌ఐఎల్‌) చైర్మన్‌ ముఖేశ్‌ అంబానీది అగ్రస్థానం. ఇప్పుడు కాదు, వరుసగా ఎనిమిదిసార్లు ఆయనే అగ్రస్థానంలో నిలుస్తూ వస్తున్నారు. తాజా గణాంకాల ప్రకారం.. ముఖేశ్ అంబానీ సంపద రూ.3,80,700 కోట్లు. ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల బడ్జెట్ పద్దు మొత్తం విలువ కన్నా.. అంబానీ సంపదే ఎక్కువ.

ముఖేశ్ అంబానీ పట్టిందల్లా బంగారమే అయింది. తన తండ్రి ధీరూభాయ్ అంబానీ నుంచి స్వీకరించిన వేల కోట్ల ఆస్తిని ఆయన ఇప్పుడు లక్షల కోట్ల ఆస్తిగా మార్చారు. డబ్బే వారసత్వంగా సంక్రమించి ఆయన చుట్టూ తిరిగింది తప్ప.. ఏనాడూ ఆయన డబ్బు కోసం వెంపర్లాడలేదు.. దాని చుట్టూ తిరగలేదు. ముఖేశ్ ఏ రంగంలో ప్రవేశించినా శ్రమనే నమ్ముకుని విజయశిఖరాలు అధిరోహించారు. తన వ్యాపార సామ్రాజ్యం ద్వారా లక్షల మందికి ఉపాధి కల్పించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు.

వరుసగా ఎనిమిదిసార్లు దేశంలోనే శ్రీమంతుడిగా నిలిచినా.. ఆయన ఆ వైభవాన్ని తన ఆహార్యంలోకానీ, మాటతీరులోకానీ కనిపించనివ్వరు. నిరాడంబరంగా ఉంటూ తన కంపెనీలోని సగటు ఉద్యోగిలాగే నిరంతరం కష్టపడతారు. దేశంలోనే అపర కుబేరుడని ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ముఖేశ్ అంబానీ నిజానికి పుట్టింది మన దేశంలో కాదంటే ఆశ్చర్యం కలగకమానదు. విదేశంలో పుట్టినా.. ఇంతటి సంపదను సృష్టించి.. ప్రపంచంలోనే భారతదేశం కీర్తిని దశదిశలా వ్యాపింపజేస్తున్న ముఖేశ్ అంబానీ జీవన శైలి ఎలా ఉంటుందో, ఆయన ఇష్టాయిష్టాలేమిటో తెలుసుకుందామా!

పుట్టింది యెమెన్‌లో.. పెరిగింది ముంబైలో…

ముఖేశ్ అంబానీ తల్లిదండ్రులు ధీరూభాయ్ అంబానీ, కోకిలా బెన్. ధీరూభాయ్ అంబానీ ఉద్యోగం కోసం తన యుక్తవయసులోనే యెమెన్ వెళ్లారు. అక్కడ ఉండగానే ధీరూభాయ్ దంపతులకు ముఖేశ్ అంబానీ జన్మించారు. అయితే ముఖేశ్ పుట్టిన మరుసటి సంవత్సరమే.. అంటే 1958లో ధీరూభాయ్ అంబానీ ముంబైకి తిరుగు పయనమయ్యారు. దీంతో వారి వ్యాపార సామ్రాజ్యానికి ఇక్కడే బీజం పడింది. ముఖేశ్ బాల్యం ముంబైలోనే గడిచింది. ముంబైలోని హిల్ గ్రాంజ్ హై స్కూల్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఆ తరువాత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో ఆయన కెమికల్ ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకున్నారు.

స్టాన్‌ఫోర్డ్ వర్సిటీలో ఎంబీఏ చేస్తూ...

స్టాన్‌ఫోర్డ్ వర్సిటీలో ఎంబీఏ చేస్తూ…

కెమికల్ ఇంజినీరింగ్ పూర్తయిన తరువాత ఏంబీఏ చదివేందుకు స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్లిన ముఖేశ్ అంబానీ తన తండ్రి ప్రారంభించబోయే కొత్త వ్యాపారానికి సారథ్యం వహించేందుకు మధ్యలోనే తిరిగి ముంబై వచ్చేశారు. ఇప్పుడు రిలయన్స్ గ్రూప్ ఎంత పెద్దదో, ఎన్ని రంగాల్లో ఈ గ్రూప్ విస్తరించిందో మనకు తెలిసిందే. మరి అంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నడపాలంటే ఎంతో కృషి, పట్టుదల ఉండాలి. ఎంతో క్రమశిక్షణ కలిగి ఉంటే తప్ప ఈ స్థాయికి చేరుకోవడం అసాధ్యం. ధీరూభాయ్ అంబానీ తన వారసులకు ఇచ్చింది క్రమశిక్షణ, పట్టుదల, అకింత భావం వంటి లక్షణాలనే. చిన్నప్పుడు తండ్రి నేర్పిన విలువల్ని ఇప్పటికీ ముఖేశ్ పాటిస్తున్నారంటే అంబానీ సోదరులపై తండ్రి ప్రభావం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

సాంప్రదాయ ఉమ్మడి కుటుంబం...

సాంప్రదాయ ఉమ్మడి కుటుంబం…

ముఖేశ్‌ అంబానీది గుజరాతీ హిందూ కుటుంబం. పెద్ద కుమారుడు ముఖేశ్ తరువాత ధీరూభాయ్ అంబానీకి మరో ముగ్గురు పిల్లలు జన్మించారు. వారి పేర్లు అనిల్, నైనా, దీప్తి. సాంప్రదాయ ఉమ్మడి కుటుంబంలో పెరిగిన ముఖేశ్‌ కుటుంబ విలువలకు అమిత గౌరవం ఇస్తారు. ప్రతిరోజూ తల్లి కోకిలా బెన్ ఆశీర్వాదం తీసుకోనిదే ఇంటి నుంచి ఆయన అడుగు బయటపెట్టరు. తను ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. కుటుంబసభ్యులకి, బంధువులకు కచ్చితంగా సమయం కేటాయిస్తారు. ఇంట్లో జరిగే శుభకార్యాలకి అందరినీ పిలుస్తారు. ఇక ముఖేశ్ సతీమణి నీతా. వీరిది ప్రేమ ప్లస్ పెద్దలు కుదిర్చిన పెళ్లి. ముఖేష్‌కి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వారి పేర్లు.. ఆకాష్, ఇషా, అనంత్. పెద్ద కోడలు శ్లోకా మెహతా. అల్లుడి పేరు ఆనంద్ పిరమాల్. చిన్న కుమారుడు అనంత్ అంబానీకి ఇంకా వివాహం కాలేదు.

దేవుడిపై అపార విశ్వాసం...

దేవుడిపై అపార విశ్వాసం…

దేవుడి మీద ముఖేశ్‌కి అపార విశ్వాసం. కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతారు. మన కృషి, పట్టుదలకు దేవుడి అనుగ్రహం తోడైతే విజయం ఖాయమంటారు. ఇక కూతురు ఇషా అంబానీ అంటే ముఖేశ్‌కి అమితమైన ప్రేమ. తన ఇద్దరు పిల్లలు ఆకాశ్, ఇషా పెళ్లిళ్లు హిందూ సాంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. ఇషాను అత్తవారింటికి పంపుతూ ముఖేశ్ కన్నీటి పర్యంతమయ్యారంటే కూతురంటే ఆయనకు ఎంత ప్రేమో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పెద్ద కోడలు శ్లోకా మెహతా పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులందరి శుభాకాంక్షలతో కూడిన వీడియోని విడుదల చేసి ఆమెని ఆశ్చర్యపరిచారు. ముఖేశ్ ప్రతి పండగని కుటుంబ సభ్యులతో కలిసి సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. దీనికోసం ఇంట్లోనే పెద్ద దేవాలయం కూడా నిర్మించారు.

క్షణం తీరిక దొరకని బిజీ షెడ్యూల్...

క్షణం తీరిక దొరకని బిజీ షెడ్యూల్…

నేనే ఛైర్మన్‌ని కదా.. ఆఫీసుకి నేను ఎప్పుడెళితే ఏంటి? నన్నెవరైనా అడుగుతారా? అనే అహంభావం ఎన్నడూ ఆయనలో కనిపించదు. ఛైర్మన్ అయినా తన ఉద్యోగుల్లో ఒకరిగానే ఆయన ఫీలవుతారు. అందరికంటే ముందు తానే ఆఫీసులో ఉండాలని కోరుకుంటారు. ఈ క్రమశిక్షణే ఈ రోజు ఆయన్ని ఇంతటి ఉన్నత స్థానంలో నిలబెట్టింది. ప్రతి మనిషికీ వ్యక్తిగత క్రమశిక్షణతోపాటు ఆర్థిక క్రమశిక్షణ కూడా ఉండాలంటారాయన. తన విజయాలకు కారణాల్లో క్రమశిక్షణే ముఖ్య కారణమని అనేక సందర్భాల్లో చెబుతారు. అంతేకాదు, ప్రతి పనిలోనూ ముఖేశ్ సమయపాలన పాటిస్తారు. రోజూ ఉదయం 10 గంటలకు ఆఫీస్‌కి వెళ్లే ముఖేశ్ రాత్రి 9 గంటల వరకు సమావేశాలు, సమీక్షలతో తీరిక లేకుండా గడుపుతారు. చేసే ప్రతి పనికి స్వయంగా ఆయనే ప్రణాళికలు రచించుకుంటారు. నిరంతరం అప్‌డేట్‌గా ఉండడం కోసం పుస్తకాలు బాగా చదువుతారు.

ప్రేమ ప్లస్ అరేంజ్డ్ మ్యారేజ్...

ప్రేమ ప్లస్ అరేంజ్డ్ మ్యారేజ్…

ముఖేశ్ భార్య నీతా. వీరిద్దరిది చాలా భిన్నమైన ప్రేమ కథ. నీతా సాంప్రదాయ నృత్యకారిణి. ఓ ప్రదర్శనలో ఆమెను చూసిన ముఖేశ్ తల్లి కోకిలా బెన్ ఆమెను తన కోడలిగా చేసుకోవాలని నిశ్ఛయించుకున్నారట. ఈ విషయాన్ని ఆమె భర్త ధీరూభాయ్‌కి, కొడుకు ముఖేశ్‌కి చెప్పారు. తొలుత ధీరూభాయ్ నీతా కుటుంబాన్ని సంప్రదించారు. ఆ తరువాత ఆమెని తన కార్యాలయానికి పిలిపించుకుని విషయం చెప్పారు. మరోవైపు ధీరూభాయ్ దంపతులు.. అప్పటికి పెళ్లికి సిద్ధంగా లేని ముఖేశ్‌ని ఏదోలా ఒప్పించారు. అలా ముఖేశ్, నీతా కలుసుకున్నారు.

నడిరోడ్డుపై ‘పెళ్లి ప్రపోజల్’...

నడిరోడ్డుపై ‘పెళ్లి ప్రపోజల్’…

మొదట్లో ముఖేశ్, నీతా స్నేహితులుగానే మెలిగారు. ఆ పరిచయం కాస్తా కొంతకాలానికి ప్రేమగా మారింది. ఓ రోజు కారులో వెళుతుండగా.. ముఖేశ్ రోడ్డు మధ్యలో కారు ఆపేసి ‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా” అని నీతాను అడిగారు. నీతా మౌనం వహించడంతో.. తనకు సమాధానం చెప్పేవరకు కదిలేదిలేదంటూ ముఖేశ్ భీష్మించారు. దీంతో ఆ రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వెనుకనుంచి వాహనాల హారన్‌ మోగిస్తున్నాయి. అప్పటికే ముఖేశ్‌ని నీతా ఇష్టపడుతోందికానీ.. హఠాత్తుగా ముఖేశ్ అలా అడిగేసరికి ఆమె కాసేపు ఆలోచించినా ఆ తరువాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారంట. అలా ఇరు కుటుంబాల ఇష్ట ప్రకారం వీరి ప్రేమ ప్రయాణం పెళ్లిపీటల వరకు చేరింది.

అన్యోన్య దాంపత్యం...

అన్యోన్య దాంపత్యం…

అప్పటి నుంచి ముఖేశ్, నీతాల దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతోంది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వీరంతా కూడా పెద్దవారై ఇప్పుడు తండ్రి వ్యాపార సామ్రాజ్యంలో భాగస్వాములయ్యారు. ఇక భార్య నీతా అంటే ముఖేశ్‌కు అమితమైన ప్రేమ. ఆమె 44వ పుట్టిన రోజునాడు ఆయన రూ.250 కోట్ల విలువ చేసే ఎయిర్‌బస్ ఏ319 విమానాన్ని ఆమెకు బహూకరించారు. అది నీతా జీవితంలో ఒక మరువలేని మధుర స్మృతి. ముఖేష్‌కి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వారి పేర్లు.. ఆకాష్, ఇషా, అనంత్. పెద్ద కోడలు శ్లోకా మెహతా. అల్లుడి పేరు ఆనంద్ పిరమాల్. చిన్న కుమారుడు అనంత్ అంబానీకి ఇంకా వివాహం కాలేదు.

ఇడ్లీ, సాంబార్ అంటే మహా ఇష్టం...

ఇడ్లీ, సాంబార్ అంటే మహా ఇష్టం…

ముఖేశ్ అంబానీ పూర్తి శాకాహారి. ఆయనకు మద్యం అంటే గిట్టదు. దక్షిణాది వంటకాలని బాగా ఇష్టపడతారు. ఇడ్లీ సాంబర్‌ అంటే మహా ఇష్టంగా తింటారు. ఇంజినీరింగ్ చదివే రోజుల్లో స్నేహితులతో కలిసి తరచూ ఆయన మైసూర్ కేఫేకి వెళ్లేవారట. ఆ అలవాటు ఇప్పటికీ మరిచిపోలేదాయన. అప్పుడప్పడూ మైసూర్ కేఫేకి వెళుతుంటారు. ఎందుకంటే అక్కడ ఆయనకి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఇప్పుడైతే ముఖేశ్ ఇంట్లోనే ఓ పెద్ద రెస్టారెంట్ ఉంది. అందులో అన్ని రకాల వంటకాలు చేసే చెఫ్‌లు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. రోజూ ఎంత బిజీగా ఉన్నా రాత్రి మాత్రం కుటుంబ సభ్యులందరితో కలిసే ముఖేశ్ భోంచేస్తారు.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు...

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు…

దేశంలోనే అపర కుబేరుడు ముఖేశ్ ఇల్లు ‘యాంటిలియా’ ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. 27 అంతస్తులతో నిర్మించిన ఈ భవనం భూతల స్వర్గమే. ఈ ఇంటిపైన పైభాగాన మూడు హెలీప్యాడ్‌లు ఉంటాయి. ఇంట్లో అత్యాధునిక హంగులతో కూడిన థియేటర్ కూడా ఉంది. ముఖేశ్‌ బాలీవుడ్ సినిమాల్ని బాగా చూస్తారు. ఇంట్లోనే థియేటర్ ఉండడంతో వారానికి కనీసం మూడు సినిమాలైనా చూస్తారట. అంతేకాదు, ఓ పెద్ద పార్కును కూడా ఆయన తన ఇంట్లోనే సృష్టించుకున్నారు. ఖాళీ సమయాల్లో ముఖేశ్ ఈ పార్కులోనే సేదతీరుతారు. ఇంకా ఈ ఇంట్లో స్విమ్మింగ్ పూల్, రెస్టారెంట్, ఐస్‌క్రీం పార్లర్, అతిథుల కోసం ఒక మినీ బార్ ఉంటాయి. అలాగే ఒకేసారి 160 కార్లు పట్టే గ్యారేజి కూడా ఉంది. రెస్టారెంట్‌లో నిత్యం అన్ని రకాల వంటకాలు చేసే చెఫ్‌లు అందుబాటులో ఉంటారు. ముఖేశ్ ఇంటి నిర్వహణకే 600 మంది సిబ్బంది అవసరం అంటే ఇల్లు ఎంత పెద్దదో ఊహించుకోవచ్చు.

 ఆటలంటే ఇష్టం, కార్లంటే మహాసరదా...

ఆటలంటే ఇష్టం, కార్లంటే మహాసరదా…

ముఖేశ్‌ అంబానికి ఆటలంటే మహా ఇష్టం. కాలేజీ రోజుల్లో హాకీ బాగా ఆడేవారట. ఇప్పుడు ఐపీఎల్‌లోని ‘ముంబై ఇండియన్స్’ జట్టు వీరిదే. స్వయంగా మైదానానికి వెళ్లి ఆటని ఆస్వాదించడమంటే ముఖేశ్‌కి చాలా ఇష్టం. అంతేకాదు.. కార్లన్నా ఈ కుబేరుడికి మహా సరదా. ఈయన వద్ద ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లు చాలా ఉన్నాయి. మెర్సిడెస్ మేబ్యాక్ 600గార్డ్, మేబ్యాక్ 62, బీఎండబ్ల్యూ 760 ఎల్ఐ, రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఆయన వద్ద కార్ల జాబితాలో కొన్ని. డ్రైవర్లున్నప్పటికీ .. ఆఫీస్‌కి సొంతగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడానికే ఇష్టపడతారు. కొత్త తరం అభిరుచులెలా ఉన్నాయో గమనిస్తూ ఉంటారు ముఖేశ్. దీనికోసం ఆయన తన పిల్లలు, వారి స్నేహితులు, కంపెనీలోని యువ ఉద్యోగులతో తరచూ మాట్లాడుతుంటారు.

 వచ్చే 20 ఏళ్లు భారత్‌దే...

వచ్చే 20 ఏళ్లు భారత్‌దే…

క్రమశిక్షణతో, అలుపెరగని కృషితో అడుగుపెట్టిన ప్రతి రంగంలో విజయం సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు ముఖేశ్ అంబానీ. పిల్లలు చేతికందిరావడంతో క్రమంగా తన వ్యాపార సామ్రాజ్యంలో వారినీ భాగస్వాములని చేస్తున్నారు. వచ్చే 20 ఏళ్లు భారత్‌దే అని, దేశాన్ని ఉన్నత స్థానంలో నిలిపే బాధ్యత యువతపైనే ఉందంటారాయన. అందుకోసం లక్ష్యాలని నిర్దేశించుకుని దేశాభివృద్ధిలో భాగం కావాలని యువకులకు సందేశం ఇస్తుంటారు ముఖేశ్.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here