అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

0
3


అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

మృతిచెందిన గువ్వ రాజు

నిజాంసాగర్‌, న్యూస్‌టుడే: నిజాంసాగర్‌ మండలం బ్రహ్మణపల్లి గ్రామానికి చెందిన గువ్వ రాజు(34) అప్పుల బాధతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు భార్య అనిత తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన రాజుకు మతిస్థిమితం లేదు. ఆస్పత్రి ఖర్చులతో పాటు, పంటల కోసం కుటుంబసభ్యులు సుమారుగా రూ.3 లక్షలు అప్పులు చేశారు. అవి తీర్చడానికి ఆయన ఉపాధి కోసం మూడు నెలల క్రితం హైదరాబాద్‌ వెళ్లి ఇటీవల గ్రామానికి తిరిగి వచ్చారు. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్యహత్య చేసుకున్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయన్న తెలిపారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here