అభిరుచి అదరహో

0
1


అభిరుచి అదరహో

న్యూస్‌టుడే, సిరికొండ

‘పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి..’ అన్నట్లు.. ఇలాంటివారు తమ అభిరుచులతో ప్రత్యేకతను చాటుతుంటారు. సిరికొండ మండలం పెద్దవాల్గోట్‌కు చెందిన భూమయ్య ఆ కోవకే చెందుతారు.

తన ప్రత్యేకతను చాటుకోవాలనే తపనతో భూమయ్య వివిధ దేశాల కరెన్సీ నోట్లు, నాణేలు, సాధారణ, క్రీడా తపాలా బిళ్లలను సేకరిస్తున్నారు. ఇప్పటికే 135 దేశాల కరెన్సీ, 100 దేశాల స్టాంపులు, మరో 100 దేశాల ప్రపంచ ఫుట్‌బాల్‌ సమాఖ్య పోస్టల్‌ స్టాంపులను సేకరించారు. రూ.25 పైసల నాణెం మొదలుకొని రూ.వెయ్యి, రూ.5 వేల విలువైన వివిధ దేశాల నోట్లు ఈయన వద్ద ఉన్నాయి. గత 14 ఏళ్లుగా అమెరికా, ఆస్ట్రేలియా, చైనా, ఇరాక్‌, ఇరాన్‌, కజకిస్థాన్‌, పాకిస్థాన్‌, బ్రిటన్‌, కెనడా, దక్షిణాఫ్రికా, బ్రునై, ఆఫ్ఘనిస్థాన్‌, ఈజిఫ్ట్‌, రష్యా, సౌదీ అరేబియా, కొరియా, బెహ్రెయిన్‌, సింగపూర్‌.. తదితర దేశాల కరెన్సీలు సేకరించారు.

దూరవిద్యలో చదువు..
చదువు కోవాలనే తపనకు పేదరికం అడ్డుకాదని నిరూపించారు భూమయ్య. ఒకటి నుంచి పదో తరగతి వరకు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివారు. భీమ్‌గల్‌లోని ఓ ప్రైవేటు బడిలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే(2001లో అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం ద్వారా) దూరవిద్యలో బీఏ పూర్తి చేశారు. ఆర్థిక ఇబ్బందులతో బతుకు దెరువు కోసం దుబాయి వెళ్లారు. అక్కడ పగలు పని చేస్తూ రాత్రుళ్లు చదివేవారు. అలా(ఉస్మానియా విశ్వవిద్యాలయం దూరవిద్య ద్వారా) 2005-2007లో ఎంఏ(చరిత్ర) పూర్తి చేశారు. 2009లో బీఈడీ పూర్తయింది.

గిన్నీస్‌లో స్థానమే లక్ష్యం
– భూమయ్య, పెద్దవాల్గోట్‌
గిన్నీస్‌ బుక్‌లో స్థానం సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. నాకంటూ ప్రత్యేకత ఉండాలనే వివిధ దేశాల స్టాంపులు, కరెన్సీలు సేకరిస్తున్నా. త్వరలో ప్రపంచంలోని అన్ని దేశాల కరెన్సీ, నాణేలు, స్టాంపులను సేకరించి లక్ష్యాన్ని ఛేదిస్తా.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here