అభివృద్ధి పనులకు స్పీకర్‌ శంకుస్థాపన

0
2నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలో పలు అభివద్ధి పనులకు తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి శంకుస్థాపన చేశారు. పట్టణంలోని మిస్త్రీ గల్లీ, బీడీ వర్కర్స్‌ కాలనీ, ఇస్లాంపూర, కోన బాన్సువాడ, దాసరి గల్లీ, సంగమేశ్వర కాలనీలలో పలు అభివద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్‌ పట్టణంలో స్థానికంగా పర్యటించడానికి ప్రజలతో సులువుగా మాట్లాడడానికి ప్రత్యేకంగా తెప్పించిన విద్యుత్తు బగ్గీ వాహనంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పర్యటించారు. అనంతరం మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా పరిదిలోని బాన్సువాడ, బీర్కూర్‌, నసరుల్లాబాద్‌ మండలాలలోని వివిధ అభివద్ధి పనుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక నిధి క్రింద రూ.5.87 కోట్లు మంజూరు చేశారన్నారు. బాన్సువాడ పట్టణంలోని వివిధ కాలనీలలో స్వతంగా నిర్మించుకుంటామనే లబ్ధిదారులకు 300 ఇళ్ళను నూతనంగా మంజూరు చేశామన్నారు. బాన్సువాడ పట్టణం పరిదిలో పాతవి, కొత్తవి కలిపి రెండు వేల రెండు పడక గదుల ఇళ్ళను మంజూరు చేశామని, అర్హులైన పేదవారికి మాత్రమే డబల్‌ బెడ్‌ రూం ఇళ్ళను మంజూరు చేస్తున్నామన్నారు. హనుమాన్‌ వ్యాయామశాల స్థలంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌, కమ్యునిటీ భవనం నిర్మాణానికి రూ. 60 లక్షలు మంజూరు అయ్యాయన్నారు. అదేవిధంగా విజ్ఞప్తి చేసిన వెంటనే ముఖ్యమంత్రి బాన్సువాడ పట్టణంలోని నూతన బ్లడ్‌ బ్యాంకులో విధుల కోసం నూతనంగా 6 పోస్టులను మంజూరు చేశారని స్పీకర్‌ తెలిపారు. త్వరలోనే జిల్లా కలెక్టర్‌ నియామకాలను పూర్తి చేస్తారన్నారు. ఆయన వెంట పలువురు తెరాస నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here