అమెరికా-భారత్ ట్రేడ్ టాక్స్: ట్రంప్ గేమ్ ఆడుతున్నారా, ఏం కోరుకుంటున్నారు?

0
3


అమెరికా-భారత్ ట్రేడ్ టాక్స్: ట్రంప్ గేమ్ ఆడుతున్నారా, ఏం కోరుకుంటున్నారు?

ఢిల్లీ: అమెరికా-ఇండియా మధ్య శుక్రవారం వాణిజ్య చర్చలు ప్రారంభం అవుతున్నాయి. ఇరుదేశాలకు చెందిన సంబంధిత అధికారులు భేటీ కానున్నారు. గత కొద్ది నెలలుగా ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. టిట్ ఫర్ ట్యాట్ – టారిఫ్.. దెబ్బకు దెబ్బ అంటూ ఇరుదేశాలు టారిఫ్స్ పెంచడం, ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇండియన్ అధికారులతో అమెరికా ప్రతినిధులు

జీ20 సమావేశాల్లోనే మోడీ-ట్రంప్ తదుపరి చర్యల గురించి మాట్లాడుకున్నారు. అయినప్పటికీ శుక్రవారం నాటి చర్చలకు ముందు ట్రంప్ ట్వీట్ ద్వారా భారత్‌కు హెచ్చరికలు జారీ చేశారు. భారత్ చాలా ఏళ్లుగా టారిఫ్ ప్రయోజనం పొందుతుందని, ఇక దీనిని అంగీకరించేది లేదని ట్వీట్ చేశారు. ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో చర్చలు ప్రారంభమవుతున్నాయి. సౌత్ అండ్ సెంట్రల్ ఆసియా అసిస్టెంట్ యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్స్ (AUSTR) క్రిష్టోఫర్ విల్సన్ ఆధ్వర్యంలో అమెరికా అధికారులు ఇండియన్ అధికారులు భేటీ కానున్నారు. భారత్‌లో ఎన్నికల కారణంగా గతంలో నిలిచిపోయిన చర్చలు, ఇప్పుడు తిరిగి ప్రారంభమవుతున్నాయి.

అమెజాన్, వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్‌పై ప్రభావం... అమెరికా ఏం కోరుకుంటోంది..

అమెజాన్, వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్‌పై ప్రభావం… అమెరికా ఏం కోరుకుంటోంది..

భారత్‌లో ఎన్నికలు పూర్తయ్యాయని, ఈ నేపథ్యంలో AUSTR అధికారులు చర్చల నిమిత్తం ఇండియాకు వస్తున్నారని AUSTRఅధికార ప్రతినిధి వెల్లడించారు. AUSTRఅధికారులు వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో, అధికారులతో చర్చించనున్నారు. అలాగే, ఐటీ ఇండస్ట్రీకి చెందిన ఉన్నతాధికారులను కలవనున్నారు. ఇండియన్ ఈ-కామర్స్ నిబంధనలు కఠినంగా ఉన్నాయని, వీటిని మార్చాలని అమెరికా కోరుకుంటోంది. వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి వాటిపై ఎక్కువ ప్రభావం పడుతోందని, దీంతో విదేశీ పెట్టుబడుల రూల్స్ సరళతరం చేయాలని అమెరికా భావిస్తోంది.

ఫ్రీ ట్రేడ్‌తో మోడీ మేకినిండియాకు దెబ్బ, ట్రంప్ గేమ్

ఫ్రీ ట్రేడ్‌తో మోడీ మేకినిండియాకు దెబ్బ, ట్రంప్ గేమ్

జీ20 సమ్మిట్ సందర్భంగా మోడీ-భేటీ సమావేశం అనంతరం, AUSTR అధికారులతో చర్చలు సానుకూల సంకేతానికి నిదర్శనమని, అయితే డొనాల్డ్ ట్రంప్ తన ట్వీట్ ద్వారా కఠిన చర్యలు, కఠిన వైఖరి ఉంటుందని వెల్లడించారని ఓ అధికారి అభిప్రాయపడ్డారు. అమెరికాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంటే.. భారత్ పోటీతత్వాన్ని దెబ్బతీస్తుందని, అలాగే మోడీ కోరుకుంటున్న మేకిన్ ఇండియా ప్లాన్‌కు దెబ్బపడుతుందని భావిస్తున్నారు. అమెరికా ప్రయోజనాల కోసమే ట్రంప్ పెద్ద గేమ్ ఆడుతున్నారని భారత అధికారులు భావిస్తున్నారు. అమెరికా – భారత్ వ్యూహాత్మక చర్చల్లో వాణిజ్యంపై దృష్టి సారించాలని చెబుతున్నారు. కాగా, 2014లో అమెరికా – భారత్ వాణిజ్య విలువ 142.1 బిలియన్ డాలర్లు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here