అమ్మకానికి ఉద్యోగాలు..! అబాసు పాలవుతున్న జగన్ అవినీతి రహిత పాలనా సిద్దాంతం..!!

0
3


అమ్మకానికి ఉద్యోగాలు..! అబాసు పాలవుతున్న జగన్ అవినీతి రహిత పాలనా సిద్దాంతం..!!

అమరావతి/హైదరాబాద్ : వైసిపి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కాకముందే కొంత మంది పార్టీ నేతలు అవినీతికి పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వం నియామకాలు, గ్రామ వాలంటీర్లు, బదీలీలు, వంటి అంశాల్లో పెద్ద యెత్తున డబ్బు చేతులు మారుతున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఎమ్మెల్యేలు కూడా చేతివాటం ప్రదర్శించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు వార్తలు ఘుప్పుమంటున్నాయి. ఉద్యోగానికి ఇంత రేటని స్థానిక నేతలు ఫిక్స్ అవడంతో ప్రభుత్వానికి కొత్త చిక్కులు వచ్చి పడే అవకాశాలు ఉన్నట్టు చర్చ జరుగుతోంది.

ఉద్యోగాలను అమ్ముకుంటున్న వైసీపి నేతలు..! మసక బారుతున్న జగన్ లక్ష్యం..!!

‘అవినీతి రహిత పాలనే లక్ష్యం. మంత్రులు అయినా సరే దారి తప్పితే వారిపై తప్పకుండా వేటు వేస్తాను’ ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పిన మాట. ఈ మాటను వాస్తవ రూపం దాల్చేలా ఆయన అడుగులు వేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు ఎవరు అవినీతికి పాల్పడినా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎప్పటికప్పుడు తెలిసేలా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇంటెలిజెన్స్, ఐబీతో పాటు… వైసీపీలోని కొందరు నమ్మకస్తులైన నేతలు ఈ నివేదకలు సిద్ధం చేసి సీఎంవోకి అందేలా చూస్తున్నారు. ఐనప్పటికి కొంత మంది నేతలు దర్జాగా అవినీతికి పాల్పడుతున్నట్టు తెలుస్తోంది.

ఎంతో నష్టపోయామంటున్న నేతలు..! అవకాశం వస్తే సంపాదించుకోవద్దా అంటూ ప్రశ్నలు..!!

ఎంతో నష్టపోయామంటున్న నేతలు..! అవకాశం వస్తే సంపాదించుకోవద్దా అంటూ ప్రశ్నలు..!!

ఏపీలో ఉద్యోగాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. గ్రామ వాలంటీర్ పోస్టులను అక్కడి అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొందరు అమ్ముకుంటున్నారు. ఒక పోస్టుకు 50వేల రూపాయలను రేటుగా నిర్ణయించారు. ఒకవైపు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డేమో… ‘అవినీతిరహిత పాలన అందిస్తాను’ అని చెప్పుకొస్తున్నారు. క్షేత్రస్థాయిలోనేమో… ఆయన పార్టీ ఎమ్మెల్యేలు ఇలా పోస్టులను అమ్ముకుంటున్నారు. ముఖ్యమంత్రికి చెడ్డ పేరు తెచ్చేందుకు ఆ ఎమ్మెల్యేలు కంకణం కట్టుకున్నట్టుగా ఉందన్న విమర్శలు, వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి. గ్రామ వాలంటీర్ పోస్టుకు నెలసరి వేతనమే ఐదువేల రూపాయలు. అలాంటి పోస్టును 50వేలకు అమ్ముకుంటున్నారంటే… ఆ ఎమ్మెల్యేలు ఎంత ‘ఆకలి’ గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

జగన్ సిద్దాంతానికి తూట్లు..! అందితే చాలనుకుంటున్నారు నోట్లు..!!

జగన్ సిద్దాంతానికి తూట్లు..! అందితే చాలనుకుంటున్నారు నోట్లు..!!

వైసీపీలోని కొందరు ఎమ్మెల్యేలు మాత్రమే ఇలా ‘ ఆకలి’ తో ఆవురావురుమని ఉన్నట్టు తెలుస్తోంది. మరికొందరు ఎమ్మెల్యేలు మాత్రం, తమ కార్యకర్తలకు ఈ పోస్టులను కట్టబెడుతున్నారట. కొద్దిమంది ఎమ్మెల్యేలు మాత్రమే, తమ అధినేత, సీఎం జగన్ బాటలోనే ఈ నియామకాలను నిజాయితీగా సాగనిస్తున్నారట. గత ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీతరఫున పని చేసి బాగా సంపాదించుకున్న వాళ్లు కొందరు ఇప్పుడు ఆ పోస్టులను కొనుక్కొంటున్నారని సమాచారం. అక్రమ సంపాదనలో యాభై వేలు కట్టి మళ్లీ ఈ ప్రభుత్వంలోనూ దోపిడీకి ట్రయల్స్ వేయడానికి తెలుగుదేశం క్యాడర్ చాలా చోట్ల ఈ పదవుల్లోకి చేరిపోతోందని వార్తలు వస్తుండటం గమనార్హం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లోనూ ఈ పరిణామాలు అసహనాన్ని కలిగిస్తున్నట్టు తెలుస్తోంది. వైసిపి నేతలు మాత్రం జిల్లాల్లో ఇలాంటి వాతావరణం మాత్రం కనిపించడం లేదని వివరణ ఇస్తున్నారు.

గ్రామ సచివాలయ ఉద్యోగాలకు భారీగా దరఖాస్తులు..! అడ్డుకట్ట వేస్తున్న లాంచాలు..!!

గ్రామ సచివాలయ ఉద్యోగాలకు భారీగా దరఖాస్తులు..! అడ్డుకట్ట వేస్తున్న లాంచాలు..!!

గ్రామ సచివాలయాలకు అభ్యర్థులు భారీగా దరఖాస్తులు చేశారు. నాలుగు రోజల్లోనే ఏకంగా 4 లక్షలకుపైగా అభ్యర్థలు దరఖాస్తు చేసుకున్నారు. కేటగిరీ 1 లో అత్యధికంగా…2 లక్షల 78 వేల 27 మంది దరఖాస్తు చేసినట్లు అధికారులు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తుల్లో… పొరపాట్లను సవరించే అవకాశం నిన్నటి నుంచి అందుబాటులోకి వచ్చింది. ఉద్యోగ నియామక పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులకు ముఖ్యమంత్రి జగన్ ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు.కాగా గ్రామ సచివాలయాల్లో 95,088 ఉద్యోగాలకు పంచాయతీరాజ్‌ శాఖ.. పట్టణ వార్డు సచివాలయాల్లో 31,640 ఉద్యోగాలకు పట్టణాభివృద్ది శాఖ నోటిఫికేషన్లను వేర్వేరుగా జారీచేసిన సంగతి తెలిసిందే. . ఆగస్టు 10వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. సెప్టెంబరు ఒకటవ తేదీన రాత పరీక్ష నిర్వహిస్తారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here