అరంగేట్ర మ్యాచ్‌లో పూనియా హాఫ్ సెంచరీ: తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం

0
3


హైదరాబాద్: ప్రియా పూనియా(124 బంతుల్లో 75 నాటౌట్), జెమినా రోడ్రిగ్స్(65 బంతుల్లో 55) హాఫ్ సెంచరీలతో రాణించడంతో వడోదర వేదికగా దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో బుధవారం జరిగిన వన్డేలో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మహిళల వన్డే ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగుతున్న మూడు వన్డేల సిరిస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా మహిళల జట్టు 45.1 ఓవర్లలో 164 పరుగులు చేసి ఆలౌటైంది. మ్యాచ్ ఆరంభంలోనే సఫారీ జట్టుకు గోస్వామి ఊహించని షాకిచ్చింది. తొలి ఓవర్‌ తొలి బంతికే గోస్వామి బౌలింగ్‌లో లిజాలే లీ(0)ని వికెట్ల ముందు దొరకబుచ్చుకుంది.

‘మా తరంలో నేను చూసిన అత్యుత్తమ కెప్టెన్‌ ధోనీయే’

ఆ తర్వాత ఏక్తా బిస్త్‌ రెండు వికెట్లతో విజృంభించడంతో 56 పరుగులకే మూడు కీలక వికెట్ల కోల్పోయి కష్టాల్లో పడింది. దక్షిణాఫ్రికా మహిళల జట్టులో లారా వోల్వార్ట్(39), త్రిషా శెట్టి(14)లు మాత్రమే ఫరవాలేదనిపించారు. 89 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన కష్టాల్లో పడిన దక్షిణాఫ్రికా… ఆ తర్వాత భారత బౌలర్ల దెబ్బకు 164 పరుగులకే ఆలౌటైంది.

భారత బౌలర్లలో ఝలన్ గోస్వామి(3/33), శిఖా పాండే(2/38), ఏక్తా బిష్త్(2/8), పొన్నం యాదవ్(2/33) సత్తా చాటారు. అనంతరం 165 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టు 41.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. భారత జట్టులో ప్రియా పూనియా(124 బంతుల్లో 75 నాటౌట్), జెమినా రోడ్రిగ్స్(65 బంతుల్లో 55) హాఫ్ సెంచరీలతో మెరిశారు.

రెట్టింపు పాయింట్లు ఇవ్వాల్సిందే: టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కోహ్లీ కొత్త సూచన

గాయం కారణంగా స్మృతి మంధాన స్థానంలో అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేసిన ప్రియా పూనియా తన అరంగేట్ర మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. అంతకముందు పూనియా కేవలం మూడు టీ20లు మాత్రమే ఆడింది. జైపూర్‌కు చెందిన 23 ఏళ్ల పూనియా ఇన్నింగ్స్‌లో ఎనిమిది బౌండరీలు ఉన్నాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here