అరుణ్‌జైట్లీకి నివాళులు

0
3


అరుణ్‌జైట్లీకి నివాళులు

భాజపా జిల్లా కార్యాలయంలో నివాళులర్పిస్తున్న నాయకులు

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: భాజపా నేత అరుణ్‌జైట్లీ మృతికి సంతాపంగా జిల్లా శాఖ కార్యాలయంలో నాయకులు శనివారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖలను జైట్లీ పకడ్బందీగా నిర్వహించి అందరి మన్ననలు పొందారని ఆయన మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి నీలం చిన్నరాజులు, పట్టణాధ్యక్షుడు భానుప్రకాష్‌, నాయకులు రవీందర్‌, నరేందర్‌, బాలకిషన్‌, శ్రీకాంత్‌ , సురేష్‌, రాజేశ్వర్‌, శ్రీనివాస్‌, ఉపేందర్‌ తదితరులు పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here