అరుణ్ జైట్లీ కన్నుమూత, ఆయన హయాంలోనే కీలక నిర్ణయలు

0
0


అరుణ్ జైట్లీ కన్నుమూత, ఆయన హయాంలోనే కీలక నిర్ణయలు

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ ఆర్థికమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ (66) శనివారం కన్నుమూశారు. కొద్ది రోజులుగా మూత్రపిండాలు, అంతుబట్టని క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ నెల 9వ తేదీన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఎయిమ్స్‌లో చేర్పించారు. ఆరోగ్యం అత్యంత విషమించడంతో ఈ రోజు మధ్యాహ్నం గం.12.07 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు.

నరేంద్ర మోడీ-1 ప్రభుత్వంలో ఆయన ఆర్థికమంత్రిగా పని చేశారు. మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక అనారోగ్య కారణాల వల్ల ఆర్థికమంత్రి బాధ్యతలకు నో చెప్పారు. దీంతో నిర్మలా సీతారామన్ ఆర్థికమంత్రి అయ్యారు. ఎన్డీయే-1 ప్రభుత్వం చివరి ఏడాది జైట్లీకి బదులు పీయూష్ గోయల్ బడ్జెట్ ప్రవేశపెట్టారు.గత ప్రభుత్వంలో అరుణ్ జైట్లీ ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడే మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.

– నోట్ల రద్దు

– గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (GST)

– ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్

– బ్లాక్ మనీ యాక్ట్ (Undisclosed Foreign Income and Assets)

– డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సుఫర్

– కన్సాలిడేషన్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు

అరుణ్ జైట్లీ గత కొంతకాలంగా చాలా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రెండుసార్లు విధుల నుంచి విరామం తీసుకున్నారు. ఈ ఏడాది మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో కూడా ఆయన బాధ్యతలకు దూరంగా ఉన్నారు. ఆ సమయంలో పీయూష్ గోయల్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

మోడీ తొలి ప్రభుత్వంలో జైట్లీ ట్రబుల్ షూటర్‌గా వ్యవహరించారు. ఆర్థిక శాఖ మంత్రిగానే కాకుండా కొన్ని రోజుల పాటు రక్షణశాఖ బాధ్యతలను కూడా నిర్వర్తించారు అరుణ్ జైట్లీ. అయితే 2019 లోకసభ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. అనారోగ్యకారణంగా పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు తనను క్యాబినెట్లోకి తీసుకోరాదని మోడీని ప్రత్యేకంగా కోరారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here