అరుదైన ఘనతకు వికెట్ దూరంలో చాహల్: ఆఖరి టీ20లో అందుకుంటాడా?

0
0


హైదరాబాద్: నాగ్‌పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరగనున్న ఆఖరి టీ20లో చైనామన్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ అరుదైన రికార్డుకి చేరువలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో చాహల్ ఒక వికెట్ తీస్తే భారత్ తరుపున టీ20ల్లో 50 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా అరుదైన ఘనత సాధిస్తాడు.

అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రవిచంద్రన్ అశ్విన్‌(52) అగ్రస్థానంలో ఉండగా, జస్ప్రీత్ బుమ్రా(51) వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడు టీ20ల సిరిస్‌లో ఇప్పటికే చాహాల్ మూడు వికెట్లు పడగొట్టాడు.

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ: యూసఫ్‌ పఠాన్‌ స్టన్నింగ్ క్యాచ్ చూశారా? (వీడియో)

తొలి టీ20లో వికెట్‌ తీసిన చాహల్‌

తొలి టీ20లో వికెట్‌ తీసిన చాహల్‌

ఢిల్లీ వేదికగా బంగ్లాతో జరిగిన తొలి టీ20లో వికెట్‌ తీసిన చాహల్‌ రాజ్ కోట్ వేదికగా ముగిసిన రెండో టీ20లో రెండు వికెట్లు సాధించాడు. దీంతో ప్రస్తుతం చాహల్ టీ20ల్లో 49 వికెట్లు పడగొట్టాడు. మూడో టీ20లో గనుక మరో వికెట్ తీస్తే అంతర్జాతీయ టీ20ల్లో 50 వికెట్లు సాధించిన మూడో బౌలర్‌గా చాహల్‌ నిలుస్తాడు.

రెండో టీ20లో నాలుగు వికెట్లు తీస్తే

రెండో టీ20లో నాలుగు వికెట్లు తీస్తే

అలా కాకుండా, ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీస్తే మాత్రం భారత్ తరుపున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. బంగ్లాదేశ్‌తో ఆదివారం జరుగనున్న మూడో టీ20లో చాహల్‌ ఈ మైలురాయిని అందుకోవాలని భారత క్రికెట్ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

400 సిక్సర్లు బాదిన భారత క్రికెటర్‌గా

400 సిక్సర్లు బాదిన భారత క్రికెటర్‌గా

మరోవైపు, టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ నాగ్‌పూర్ టీ20లో మరో రెండు సిక్సర్లు కొడితే భారత్‌ తరఫున నాలుగొందల సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా రోహిత్‌ శర్మ చరిత్ర సృష్టిస్తాడు. రాజ్‌కోట్ వేదికగా గురువారం రాత్రి ముగిసిన రెండో టీ20లో ఆరు సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో 398 సిక్సర్లు బాదాడు.

నాగ్‌పూర్ వేదికగా మూడో టీ20

నాగ్‌పూర్ వేదికగా మూడో టీ20

మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా ఆదివారం ఇరు జట్ల మధ్య ఆఖరి టీ20 నాగ్‌పూర్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ మరో రెండు సిక్సర్లు బాదితే అరుదైన ఘనత సాధిస్తాడు. భారత్ తరుపున 400 సిక్సర్లు బాదిన మొదటి క్రికెటర్‌గా మొత్తంగా ఈ జాబితాలో చోటు దక్కించుకున్న మూడో క్రికెటర్‌గా నిలుస్తాడు.

534 సిక్సర్లతో అగ్రస్థానంలో క్రిస్ గేల్

534 సిక్సర్లతో అగ్రస్థానంలో క్రిస్ గేల్

అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటి వరకూ అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో విండిస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్‌గేల్ 534 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా.. పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది 476 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం మూడు టీ20ల సిరిస్ 1-1తో సమంగా ఉంది. సిరిస్ విజేత ఎవరో ఆదివారం తేలనుంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here