అర్ధరాత్రి ఇంట్లో వింత శబ్దాలు.. బాత్రూమ్ తలుపు తెరిచి చూసి షాక్!

0
2


మాంచి నిద్రలో ఉన్న ఆ వ్యక్తికి అర్ధరాత్రి ఇంట్లో వింతైన శబ్దాలు వినిపించాయి. కళ్లు తెరిచి చూస్తే చుట్టూ ఏమీ కనిపించలేదు. కానీ, ఆ శబ్దం మాత్రం వినిపిస్తూనే ఉంది. మొదట్లో పిల్లి అరుస్తుందని అనుకున్నాడు. కానీ, అది పిల్లి అరుపు కూడా కాదు. ఆ శబ్దం చాలా వింతగా ఉండటంతో ఇంట్లోకి ఏదో దూరిందని అనుకున్నాడు. మంచం దిగి ఆ శబ్దం ఎటువైపు వస్తుంతో అటుగా వెళ్లాడు.

Also Read: లైవ్‌లో మాట్లాడుతూ.. పర్వతం పైనుంచి పడ్డ వ్యక్తి, కెమేరాలో రికార్డైన ఘటన!

బాత్రూమ్ దగ్గరకు వెళ్లేకొద్ది శబ్దం పెరగసాగింది. దీంతో నెమ్మదిగా బాత్రూమ్ తెరిచి చూశాడు. చీకట్లో ఏదో మెరుస్తున్నట్లు కనిపించింది. దీంతో దగ్గరకు వెళ్లి చూశాడు. అంతే.. అతడి గుండె ఆగినంత పనైంది. ఎక్కడ నుంచి వచ్చిందో.. ఎలా వచ్చిందో.. ఏమో.. ఓ మొసలి నోరు తెరిచి అతడి వైపే చూసింది. దీంతో షాకైన ఆ వ్యక్తి వెంటనే ‘వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ రెస్క్యూ టీమ్’కు ఫోన్ చేశాడు.

మొసలితో రెస్క్యూ సిబ్బంది

Also Read: చీటింగ్ భర్తపై ‘చిల్లర’తో రివేంజ్.. భార్యతో పెట్టుకుంటే ఇంతే!

ఈ ఘటన గుజరాత్‌లోని వడోదరలో మహేంద్ర పదియార్ అనే వ్యక్తి ఇంట్లో చోటుచేసుకుంది. అతడి ఇంటికి సమీపంలో ఉన్న విశ్వమిత్ర నది నుంచి ఊరిలోకి ప్రవేశించిన నాలుగున్నర అడుగుల మొసలి మహేంద్ర ఇంట్లోని బాత్రూమ్‌లోకి దూరింది. చీకటిగా ఉండటం వల్ల మొసలిని పట్టుకొనేందుకు వైల్డ్‌లైఫ్ రెస్క్యూ సిబ్బంది చాలా శ్రమించాల్సి వచ్చింది. అయితే, అది బాత్రూమ్‌లోకి ఎలా ప్రవేశించిందనేది మాత్రం తెలియరాలేదు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here