అర్హులందరికీ అందజేస్తాం

0
3


అర్హులందరికీ అందజేస్తాం

ఎడపల్లిలో చీరలు పంపిణీ చేస్తున్న డీఆర్‌డీఏ పీడీ రమేశ్‌ రాథోడ్‌

ఎడపల్లి,న్యూస్‌టుడే: జిల్లాలో అర్హులైన లబ్ధిదారులందరికీ బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తామని డీఆర్‌డీఏ పీడీ రమేశ్‌ రాథోడ్‌ స్పష్టం చేశారు. ఎడపల్లిలో గురువారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. జిల్లాలో 5.39 లక్షల చీరలు అవసరముండగా 4.12 లక్షల మాత్రమే వచ్చాయని చెప్పారు. మిగతావి త్వరలోనే వస్తాయన్నారు. మహిళలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎమ్మెస్సీ ఫారం, ధర్మారం గ్రామాల్లో జిల్లా పరిషత్‌ ఉపాధ్యక్షురాలు రజితాయాదవ్‌, ఎంపీపీ శ్రీనివాస్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచి మాధవి, ఎంపీటీసీ సభ్యురాలు మనీషా, తహసీల్దార్‌ అశోక్‌ కుమార్‌, ఎంపీడీవో శంకర్‌, తదితరులు పాల్గొన్నారు.

జైతాపూర్‌లో నిరసన : జైతాపూర్‌లో పలువురు మహిళలు నిరసన తెలిపారు. 30 రోజుల ప్రణాళికా పనుల్లో పాల్గొనని వారికి చీరలు ఇవ్వబోమని ప్రజాప్రతినిధులు చెప్పడంతో మహిళలు మండిపడ్డారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళన చేయడంతో పోలీసులు వచ్చి సముదాయించారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here