అలహాబాద్ బ్యాంకుకు భూషణ్ స్టీల్స్ రూ.1,775 కోట్ల మోసం

0
3


అలహాబాద్ బ్యాంకుకు భూషణ్ స్టీల్స్ రూ.1,775 కోట్ల మోసం

పంజాబ్ నేషనల్ బ్యాంక్ తర్వాత, ఇప్పుడు అలహాబాద్ బ్యాంక్ కూడా భూషణ్ పవర్ అండ్ స్టీల్ తమకు రూ.1,775 కోట్ల మోసం చేసిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తెలిపింది. భూషణ్ స్టీల్ కంపెనీకి సంబంధించి, PNB తర్వాత, అలహాబాద్ బ్యాంకులో భారీ కుంభకోణం వెలుగు చూడటం బ్యాంకింగ్‌ వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది.

NPA కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్, ఆడిటింగ్ ఆధారంగా మోసం వెలుగుచూసిందని బ్యాంక్ తెలిపింది. బ్యాంకు నిధుల్ని కంపెనీ దుర్వినియోగం చేసిందని, బ్యాంక్స్ కన్సార్షియం నుంచి నిధులు సమీకరించేందుకు ఖాతా పుస్తకాల్లో అవకతవకలకు పాల్పడినట్లు తెలిపింది. భూషణ్ స్టీల్స్‌కు ఇచ్చిన రుణాల్లో రూ.900 కోట్లకు ఇప్పటికే కేటాయింపులు జరిపినట్టు బ్యాంక్ పేర్కొంది.

ప్రస్తుతం ఈ కేసు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్సీఎల్టీ) పరిధిలో ఉంది. అయితే బ్యాంకు తాను ఇచ్చిన రుణాలను రికవరీ చేసుకునే అవకాశముందన్న విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ సైతం రూ.3,800 కోట్లకు పైగా మోసాన్ని గుర్తించింది. బ్యాంకుకు రూ.3,805 కోట్లు బకాయిపడ్డ భూషణ్ స్టీల్ లిమిటెడ్ ఈ రుణాలను మోసపూరితంగా పొందినట్లు గుర్తించామని వారం రోజుల కిందటే తెలిపింది. ఈ విషయాన్ని ఇప్పటికే ఆర్బీఐకి తెలిపినట్లు గత శనివారం స్టాక్ ఎక్సేంజిలకు తెలియజేసింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here