అలీ ఔట్: లార్డ్స్ టెస్టుతో అరంగేట్రం చేయనున్న జోఫ్రా ఆర్చర్!

0
2


హైదరాబాద్: ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన పేసర్ జోఫ్రా ఆర్చర్ టెస్టు అరంగే ట్రానికి మార్గం సుగమమైంది. ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో భాగంగా రెండో టెస్టు లార్డ్స్ వేదికగా ఆగస్టు 14న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

స్టేడియంలోని అద్దాలను పగలగొట్టిన షోయబ్ మాలిక్ (వీడియో)

ఈ టెస్టులో జోఫ్రా ఆర్చర్ బరిలో దిగడం దాదాపు ఖాయమైంది. రెండో టెస్టుకు ముందే ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు 12 మందితో కూడిన జట్టును ప్రకటించింది. గాయం కారణంగా ఆటకు దూరమైన అండర్సన్ స్థానంలో జోఫ్రా ఆర్చర్‌ను ఎంపిక చేసింది.

మరోవైపు రెండో టెస్టు నుంచి ఇంగ్లాండ్ సెలక్టర్లు మొయిన్ అలీని తప్పించారు. అలీని పక్కన పెట్టిన బోర్డు అతడి స్థానంలో ఐర్లాండ్‌తో ఏకైక టెస్టులో అదరగొట్టిన లెఫ్టార్మ్ స్పిన్నర్ జాక్ లీచ్‌కి చోటు కల్పించారు. తొలి టెస్టులో అలీ అటు బంతితో ఇటు బ్యాట్‌తో విఫలమయ్యాడు.

భారత్‌లో అప్ఘనిస్థాన్‌కు హోమ్ గ్రౌండ్: ఏ స్టేడియమో తెలుసా?

ఇదిలా ఉంటే, ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో నైట్‌వాచ్‌మన్‌గా బరిలో దిగిన లీచ్ 92 పరుగుల చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

లార్డ్స్ టెస్టుకు ఇంగ్లాండ్ జట్టు:

జో రూట్ (కెప్టెన్), జాఫ్రీ ఆర్చర్, జానీ బీర్స్టో, స్టువర్ట్ బ్రాడ్, రోరీ బర్న్స్, జోస్ బట్లర్, సామ్ కరణ్, జో వెన్లోయ్, జాక్ లీచ్, జాసన్ రాయ్, బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here