‘అల… వైకంఠపురములో…’ కథ ఇదే: మిడిల్ క్లాస్ టు బిలియనీర్!

0
3


త్రివిక్రమ్ సినిమా అంటే కేవలం మాటలు, వినోదం మాత్రమే కాదు.. బలమైన ఎమోషన్స్ కూడా ఉంటాయి. ఆ ఎమోషన్స్ చుట్టూనే కథను నడుపుతూ ఉంటారు. తన సినిమాలో ఫ్యామిలీ సెంటిమెంట్స్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంటారు త్రివిక్రమ్. ఇప్పటి వరకు ఆయన చిత్రాల్లో ప్రధానంగా కనిపించింది ఇదే. ఇలాంటి సెంటిమెంట్స్, ఎమోషన్స్‌తో కూడిన కథకు కాస్త వినోదం జోడించి ప్రేక్షకులకు అందిస్తుంటారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహిస్తోన్న ‘అల… వైకుంఠపురములో…’ సినిమా కూడా ఇదే కోవకు చెందుతుందని ఇండస్ట్రీ టాక్.

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’‌లో ఫాదర్ సెంటిమెంట్ చూపించారు. అయితే, ‘అల… వైకుంఠపురములో…’ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ చూపించబోతున్నారని సమాచారం. ఈ మేరకు స్టోరీ లైన్ బయటికి వచ్చింది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ టబు ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆమె పుట్టినరోజును పురష్కరించుకుని ఇటీవల పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇదిలా ఉంటే, టబు ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు అక్కగా నటిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసింది.

Also Read: నందమూరి అభిమానులకు నిరాశ.. వారసుడి ఎంట్రీపై బాలయ్య క్లారిటీ

ఈ సినిమాలో హీరోది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అట. అయితే, టబు బాగా డబ్బున్న హై‌క్లాస్ ఫ్యామిలీకి కోడలిగా వెళ్తుందట. కానీ, ఆ ఇంటికి వెళ్లిన తరవాత టబుకి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయట. అక్క సమస్యలను పరిష్కరించడానికి బన్నీ రంగంలోకి దిగుతారు. ఇదే అసలు కథ అని టాక్. అంతేకాదు, బన్నీ నేరుగా తన అక్క ఇంటికి వెళ్లి అక్కడే ఉండి సమస్యలను పరిష్కరిస్తారట. బన్నీ వాళ్ల అక్క ఇంటిలోకి అడుగుపెట్టే విధానం, అక్కడ జరిగే తతంగం చాలా ఆసక్తికరంగా ఉంటుందని అంటున్నారు. అంతేకాకుండా, ప్రీ క్లైమాక్స్‌లో బన్నీ బిలియనీర్‌గా కనిపిస్తారట. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి బిలియనీర్ ఎలా అయ్యాడు అనేది కూడా ఆసక్తికరమైన అంశం.

నిజానికి ‘అల… వైకుంఠపురములో…’ ఫస్ట్ లుక్‌ను పరిశీలిస్తే అందులో బన్నీ సూటుబూటు వేసుకుని చాలా క్లాస్‌గా ఉంటారు. ఆయన వెనుక ఖరీదైన బెంట్లే లగ్జరీ కారు కూడా ఉంది. కానీ, ఒక టేబుల్‌పై కూర్చొని బన్నీ బీడీ కాలుస్తూ ఉంటారు. బాగా బలిసినోడు ఇలా బీడీ కాల్చడమేంటిరా బాబూ అని ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ వచ్చినప్పుడు చాలా మంది అనుకున్నారు. అయితే, అతను సినిమాలో మిడిల్ క్లాస్ అబ్బాయి కాబట్టే బిలియనీర్ అయినప్పటికీ బీడీ కాలుస్తూ ఉంటారని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here