అసలే వరదల కాలం.. వాహనాలు మునిగిపోతే ఎలా? ఏం చేయాలి?

0
3


అసలే వరదల కాలం.. వాహనాలు మునిగిపోతే ఎలా? ఏం చేయాలి?

మన దేశంలో వర్షం పడితే గ్రామీణ ప్రాంత రైతు సంతోషిస్తాడు. అదే నగర ప్రాంత వాసి ఆందోళన చెందుతాడు. ముంబై, చెన్నై, హైదరాబాద్ లాంటి నగరాల్లో కాస్త భారీ వర్షాలు కురిస్తే.. వాహనదారులకు నరకమే కనిపిస్తుంది. ఏ నదులు పొంగకుండానే వరదలు వచ్చేస్తాయి. నిలువెత్తు నీటి ప్రవాహంలో మనుషులే కాదు, ఏకంగా కార్లు వంటి వాహనాలు కూడా మునిగిపోతాయి.

ఈ ఏడాది ముంబైలో జస్ట్ 48 గంటల్లోనే 540 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వందలాది వాహనాలు వరద నీటిలో మునిగిపోయాయి. కార్ల యజమానులైతే రోడ్డు పక్కనగాని లేదంటే ఫ్లైఓవర్ల కిందగాని తమ కార్లను విడిచిపెట్టేసి ప్రాణాలు రక్షించుకోవడం కోసం సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇలా వరద నీటిలో మునిగిపోతే వాహనానికి దిక్కెవరు?

వాహనం మునిగిపోతే కష్టమే…

వాహనాన్ని, మరీ ముఖ్యంగా కారును వరద నీటిలో నడపడం అంత సురక్షితం కాదు. ఒక్కోసారి నీటి ప్రవాహ పరిమాణం పెరిగిపోయినప్పుడు ఆ నీరు లోపలికి ప్రవేశించి.. కారు సెంట్రల్‌ డోర్‌ లాకింగ్ సిస్టమ్‌ జామ్‌ అయిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా జరిగితే కారును నడిపేవారితోపాటు కారులోని మిగతావారు కూడా లోపలే చిక్కుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాదు, ఆ వరద నీటిలో కలిసిపోయి ఉన్న బురద కూడా కారులోని ఇంజిన్‌ భాగాల్లోకి కూడా ప్రవేశించే వీలు ఉంటుంది. ఫలితంగా ఇంజిన్ దెబ్బతింటుంది.

ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలంటే...

ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలంటే…

వరద నీటిలో వాహనాలను నడపడం శ్రేయస్కరం కాదు. ఒకవేళ కారులో గనుక ఉన్నట్లయితే డోర్లను అన్‌లాక్ మోడ్‌లో ఉంచాలి. అలాగే కిటికీల అద్దాలను కిందకు దించేసి అప్పుడప్పుడూ బయట వరద ప్రవాహాన్ని గమనిస్తూ ఉండాలి. దీనివల్ల బయట వర్షపునీటి స్థాయి పెరుగుతుంటే ఆ విషయం వాహనంలో ఉన్న వారికి తెలిసిపోతుంది. ఒకవేళ నీటి పరిమాణం అంతకంతకూ పెరిగిపోతుంటే కారు నుంచి దిగిపోయి ఏదైనా ఎత్తయిన ప్రదేశానికి చేరుకోవడం మంచిది. ఎందుకంటే వాహనం విలువ కన్నా మనిషి ప్రాణం విలువైనది కదా.

పెరిగిన మోటారు బీమా క్లెయిమ్‌లు...

పెరిగిన మోటారు బీమా క్లెయిమ్‌లు…

వరద నీరు కారణంగా వాహనాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుండడంతో.. ఈ ఏడాది దేశంలోని ముంబై, ఇతర నగరాల్లో మోటారు బీమా క్లెయిమ్‌లు గణనీయంగా పెరిగాయి. వాటిలో చాలాభాగం మోటారు ఇంజిన్లు దెబ్బతిన్న క్లెయిమ్‌లే. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే.. సాధారణంగా వాహన బీమా పాలసీలో ఇంజిన్‌కు వాటిల్లే నష్టానికి ఎలాంటి రక్షణ కల్పించబడదు. కాబట్టి ఇలాంటి పరిస్థితిని ఊహించి వరద నీటిలోనూ వాహనాలకు రక్షణ ఉండేలా అదనపు కవరేజీ తీసుకోవాలి.

వరదనీరు డ్యాష్‌బోర్డు స్థాయికి చేరుతుంటే...

వరదనీరు డ్యాష్‌బోర్డు స్థాయికి చేరుతుంటే…

వరద నీటిలో కారును ఆపేస్తే గనుక ఎంత మేర అది మునిగిపోయిందో గమనించాలి. వరదనీరు కారు డోర్ల స్థాయి నుంచి పెరగకపోతే మీ కారుకు పెద్దగా నష్టం వాటిల్లనట్టే. ఒకవేళ డ్యాష్‌బోర్డు స్థాయికి నుక వరదనీరు చేరితే వెంటనే సర్వీసింగ్‌ యూనిట్‌ లేదా బీమా సంస్థకు కాల్‌ చేసి వారు చెప్పినట్టు చేయాలి. మీ కారును సమీపంలోని గ్యారేజ్‌ లేదా సర్వీస్‌ సెంటర్‌కు తీసుకెళ్లి పూర్తి తనిఖీ చేయించేందుకు టౌ సర్వీస్‌కు కాల్‌ చేయాలి. టౌ వ్యాను వచ్చే లోపు కారులోపల తడి ఉంటే, ఏదైనా బట్టతో అద్ది తొలగించేందుకు ప్రయత్నించాలి.

ఈ జాగ్రత్తలు అవసరం...

ఈ జాగ్రత్తలు అవసరం…

వరద నీటిలో కారు కొంత సమయం నిలిచిపోయినా కూడా తర్వాత మీ కారు ఇంజిన్‌ను తిరిగి ఆన్‌ చేయవచ్చు. కానీ ఒకవేళ కారు పూర్తిగా వరదనీటిలో మునిగిపోయి ఉంటే మాత్రం ఇంజిన్‌ను ఆన్ చేయకండి. అలా చేస్తే.. బురదనీరు ఇంజిన్‌లోని భాగాల్లోకి చేరి ఆ భాగాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఒక్కసారి ఇంజిన్‌ గనుక దెబ్బతింటే.. మీకు ఖర్చు తడిసి మోపెడైనట్లే. పైగా ఆ ఇంజిన్‌ను బాగు చేసేందుకు అయ్యే ఖర్చు మీ కారు మోడల్‌ను బట్టి మారుతుంది.

వాహనం అన్ని భాగాలూ తనిఖీ చేయాల్సిందే...

వాహనం అన్ని భాగాలూ తనిఖీ చేయాల్సిందే…

వరదనీటిలో నిండాగనుక మీ వాహనం మునిగిపోతే.. కొన్ని రోజుల వరకు కారును స్టార్ట్‌ చేయకుండా వేచి చూడడం మంచిది. ఎందుకంటే కారులోని ఎయిర్‌డక్టుల్లో నీటి ఆవిరి మిగిలి ఉంటే ఆన్‌ చేయడం వల్ల ఇంజన్‌ దెబ్బతింటుంది. అలాగే షార్ట్‌ సర్క్యూట్‌ అవకుండా ముందుగానే కారులోని బ్యాటరీని కూడా తొలగించాలి. బ్యాటరీని తిరిగి కనెక్ట్‌ చేసేముందు కూడా ఒకదాని తర్వాత ఒకటి అన్ని ఎలక్ట్రికల్‌ సిస్టమ్స్‌ను జాగ్రత్తగా తనిఖీ చేయాలి. హెడ్‌లైట్లు, ఇండికేటర్లు, హారన్, ఎయిర్‌ కండిషనింగ్, స్టీరియో, పవర్‌లాక్‌లు, ఇంటీరియర్‌ లైట్లను తనిఖీ చేయాలి. ఎక్కడైనా ఫ్లిక్కరింగ్‌ను గుర్తించినట్టయితే వెంటనే మెకానిక్‌కు కాల్‌ చేయాలి.

యాడాన్ కవరేజీలు తప్పనిసరి...

యాడాన్ కవరేజీలు తప్పనిసరి…

వరదనీటిలో మునిగిపోయిన కారు ఫ్యూయల్‌ వ్యవస్థను పరిశీలించాలి. పాత కార్లు అయితే వాటి నుంచి ఇంధనాన్ని తొంచడం అవసరం. బ్రేక్, క్లచ్, పవర్‌ స్టీరింగ్, కూలెంట్ యూనిట్ కూడా మార్చవలసి ఉంటుంది. ఈ పరిస్థితిని ఊహించి ముందుగానే సమగ్ర మోటారు వాహన బీమా పాలసీ తీసుకోవాలి. పాలసీ తీసుకునే ముందు పత్రాలను క్షుణంగా చదవాలి. వేటికి కవరేజి ఉందో, వేటికి లేదో బీమా ప్రతినిధిని ముందుగానే అడిగి తెలుసుకోవాలి. ఆయా పరిస్థితులకు తగిన యాడాన్‌ కవరేజీలను కూడా తీసుకోవాలి. మీ కారుకు నష్టం వాటిల్లిన సందర్భాల్లో అధిక శాతం బీమా కంపెనీయే చెల్లిస్తుంది కనుక మీ జేబుపై భారం తగ్గుతుంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here