ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్, ఇక ఫింగర్ ఫ్రింట్ లాక్

0
1


ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్, ఇక ఫింగర్ ఫ్రింట్ లాక్

ఇప్పటిదాకా ఐఫోన్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న వాట్సాప్ బయోమెట్రిక్ అథెంటికేషన్ ఇక ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ యూజర్లకు కూడా అందుబాటులోకి వస్తోంది. వాట్సాప్‌కు ఫింగర్ ఫ్రింట్ లాక్‌కు తీసుకు వచ్చినట్లు గురువారం తెలిపింది. ఐఫోన్ యూజర్లకు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఫింగర్ ప్రింట్, ఫేస్ ఐడీ అందుబాటులోకి వచ్చాయి. తాజా ఫీచర్‌తో ఇక ఆండ్రాయిడ్ యూజర్లు తమ వాట్సాప్‌ను ఓపెన్ చేసేందుకు ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ యూజ్ చేయవచ్చు.

ఐఫోన్ యూజర్లు ఉపయోగిస్తున్నట్లుగానే ఇక నుంచి ఆండ్రాయిడ్ యూజర్లు కూడా ఇప్పుడు లాక్‌ను ఎంచుకోవచ్చు. ఒకసారి ఫింగర్ అథెంటికేషన్ ఇచ్చాక ఆ తర్వాత దానిని ఓపెన్ చేయడానికి టచ్ ఐడీ తప్పనిసరి. అలాగే, వాట్సాప్‌కి ఎంత సమయంలో లాక్ పడాలో కూడా ముందే ఆటోమేటిక్‌గా సెట్ చేయవచ్చు. మెసేజ్ నోటిఫికేషన్లు కనిపించేలా చేయవచ్చు.

వాట్సాప్ ఫింగర్ ప్రింట్ లాక్ కోసం యూజర్లు సెట్టింగ్స్‌లో అకౌంట్ ప్రైవసీలోకి వెళ్తే ఫింగర్ ప్రింట్ లాక్ ఆప్షన్ కనిపిస్తుంది. అన్‌లాక్ విత్ ఫింగర్ ప్రింట్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. అంటే దానిని ఆన్ చేసి ఫింగర్ ఫ్రింట్ లాక్ ఎంచుకోవాలి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here